US Shooting Incident | అమెరికాలో దుండగుడి కాల్పులు.. ఎనిమిది మంది చిన్నారుల దుర్మరణం!

Naresh Chandan
US Shooting Incident

అక్షరటుడే, వెబ్​డెస్క్​: US Shooting Incident | అమెరికాలో మరో దారుణం చోటుచేసుకుంది. లూసియానా Louisiana లోని రద్దీ ప్రదేశంలో ఓ సాయుధ దుండగుడు రెచ్చిపోయాడు. చిన్నారులపై తుపాకీ గుండ్ల వర్షం కురిపించాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది చిన్నారులు అసువులు బాసారు.akshara today .jpglusiana

US Shooting Incident | పోలీసుల కాల్పుల్లో..

మరణించిన వారి వయసు 1 – 14 ఏళ్ల మధ్య ఉంటుందని ప్రీవ్పాట్ అధికారులు తెలిపారు. కాల్పుల అనంతరం నిందితుడు అక్కడే ఉన్న కారును దొంగిలించి పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీసులు పట్టుకోబోతుండగా.. జరిగిన కాల్పుల్లో దుండగుడు మరణించినట్లు సమాచారం.

akshara today .jpglowa

అయోపా వర్సిటీ సమీపంలోనూ..

మరోవైపు అయోవా వర్సిటీ సమీపంలోనూ కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం తెల్లవారుజామున ఇక్కడ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ గొడవలో కొందరు విద్యార్థులు కాల్పులు జరపగా.. ముగ్గురు గాయపడినట్లు తెలిసింది. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

ఇది కూడా చదవండి: KCR Jagtial Sabha | గులాబీ బాస్ ఆగమనం.. 20న జగిత్యాలలో బహిరంగ సభ.. బీఆర్ఎస్ కు పూర్వ వైభవం వచ్చేనా!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *