జాతీయంSikkim CM Walk|ఇంధన పొదుపు చర్యలు.. ఏకంగా 2 కి.మీ నడిచి వెళ్లిన సిక్కిం సీఎం

Sikkim CM Walk|ఇంధన పొదుపు చర్యలు.. ఏకంగా 2 కి.మీ నడిచి వెళ్లిన సిక్కిం సీఎం

ప్రభుత్వ వ్యయాలు, ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సరికొత్త ఆదర్శాన్ని చూపించారు.

అక్షరటుడే వెబ్‌డెస్క్:Sikkim CM Walk|ప్రభుత్వ వ్యయాలు, ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సరికొత్త ఆదర్శాన్ని చూపించారు. మే 15న జరిగిన ఒక అధికారిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన తన అధికారిక నివాసం నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లారు.

Sikkim CM Walk|నడిచి వెళ్లిన సీఎం.. టాక్సీలో తిరుగుప్రయాణం..

ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ తన నివాసమైన ‘మింటోక్‌గాంగ్’ నుండి గ్యాంగ్‌టక్‌లోని డెవలప్‌మెంట్ ఏరియా సమీపంలో ఉన్న ‘మనన్ కేంద్రం’ వరకు నడిచే వెళ్లారు. అయితే, అధికారిక కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన సాధారణ పౌరుడిలా ఒక ట్యాక్సీని మాట్లాడుకుని, అందులో తన నివాసానికి తిరిగి చేరుకోవడం విశేషం.

Sikkim CM Walk|ప్రభుత్వంలో ఇంధన పొదుపు చర్యలు..

ప్రధాని మోదీ సూచించిన క్రమశిక్షణతో కూడిన, బాధ్యతాయుతమైన పాలనలో భాగంగా సిక్కిం ప్రభుత్వం రాష్ట్రంలో పలు ఇంధన పొదుపు చర్యలను అధికారికంగా ప్రారంభించిందని సీఎం ప్రెస్ సెక్రటరీ యోగన్ తమంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని పిలుపునకు మద్దతుగా సీఎం స్వయంగా నడిచి వెళ్లి వ్యక్తిగత ఆదర్శాన్ని నెలకొల్పారని ప్రెస్ సెక్రటరీ పేర్కొన్నారు. ఈ చర్య కేవలం చూపించడానికి చేసింది కాదని, ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవాలనే నిబద్ధతకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.

Sikkim CM Walk|ప్రభుత్వ వాహనాలపై ఆంక్షలు..

ఈ అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఒక కీలక ప్రకటన చేశారు. ఇంధన పొదుపులో భాగంగా ప్రభుత్వ వాహనాలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అయితే, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. శని, ఆదివారాల్లో మాత్రం ప్రైవేట్ వాహనాలకు సరి-బేసి (Odd-Even) నిబంధన నుండి మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Tushar Kumar Mayor|అతిపిన్న వయసులోనే బ్రిటన్ మేయర్‌గా.. 23 ఏళ్ల తుషార్ సరికొత్త రికార్డు

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు...

Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలి..

అక్షరటుడే, ఆర్మూర్: Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని...

Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల...

Assistant Professor Merit List | మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Assistant Professor Merit List | ప్రభుత్వ మెడికల్...