అక్షరటుడే, వెబ్డెస్క్ : Kodagu Elephant Clash | కర్ణాటక (Karnataka)లోని కొడగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏనుగుల ఘర్షణలో చెన్నైకి చెందిన పర్యాటకురాలు మృతి చెందింది.
ఏనుగుల స్నానం చేస్తున్న సమయంలో నీటిలో రెండు ఏనుగులు ఘర్షణకు దిగాయి. ఏనుగుల మధ్య చిక్కుకొని 33 ఏళ్ల పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన సోమవారం కొడగు జిల్లాలోని ప్రసిద్ధ దుబారే ఏనుగుల శిబిరంలో చోటు చేసుకుంది. మృతురాలిని తులసిగా గుర్తించారు. ఆమె నది ఒడ్డున నిలబడి ఏనుగులకు స్నానం చేయించడాన్ని చూస్తున్నట్లు సమాచారం.
Kodagu Elephant Clash | ఒక్కసారిగా..
స్నానం చేస్తున్న సమయంలో బందీగా ఉన్న కంచన్, మార్తాండ అనే ఏనుగులు ఒక్కసారిగా పోట్లాడుకోవడం ప్రారంభించాయి. దీంతో ఒడ్డున నిలబడి వాటిని చూస్తున్న వారు భయంతో పరుగులు తీశారు. మావటీలు ఏనుగులను నియంత్రించడానికి ప్రయత్నించినప్పటికీ, కంచన్ మార్తాండ వైపు దూసుకెళ్లినట్లు సమాచారం. ఈ గందరగోళంలో, మార్తాండ అదుపుతప్పి పడింది. తులసి ఆ ఏనుగు కింద చిక్కుకుంది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
కర్ణాటకలో విషాదం.. ఏనుగుల ఘర్షణలో పర్యాటకురాలు మృతి
కర్ణాటకలోని కొడగు జిల్లాలో విషాదం నెలకొంది. దుబారే ఎలిఫెంట్ క్యాంపులో రెండు ఏనుగుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక ఏనుగు అదుపుతప్పి మహిళపై పడింది. ఏనుగు కింద కిందపడిన మహిళ మరణించింది.
(Source: Times Now)
Tragedy in Karnataka:… pic.twitter.com/Cji7qM3RoD
— Akshara Today | Telugu News (@aksharatoday) May 18, 2026
దీనిని కూడా చదవండి : Bastar Development|తుపాకుల మోత నుంచి ప్రగతి బాట.. బస్తర్ భద్రతా శిబిరాల్లో ‘జన్ సువిధా’ కేంద్రం ప్రారంభం


