తెలంగాణInternational Museum Day | మ్యూజియాలు జీవన విధానానికి జ్ఞాన కేంద్రాలు – మంత్రి జూప‌ల్లి

International Museum Day | మ్యూజియాలు జీవన విధానానికి జ్ఞాన కేంద్రాలు – మంత్రి జూప‌ల్లి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: International Museum Day | మ్యూజియాలు అనేవి కేవలం పురాతన వస్తువుల నిల్వ కేంద్రాలు మాత్రమే కావు. అవి మన నాగరికత, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు, జీవన విధానానికి అద్దం పట్టే జ్ఞాన కేంద్రాలని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, పురావ‌స్తు శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు.

ప్రపంచ వారసత్వ సంపదను రక్షించడం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు.

అంతర్జాతీయ మ్యూజియం దినోత్స‌వం సందర్భంగా సోమ‌వారం ప‌బ్లిక్ గార్డెన్ లోని రాష్ట్ర‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా మంత్రి జూప‌ల్లి హాజ‌ర‌య్యారు. జ్యోతి వెలిగించి కార్య‌క్రమాన్ని ప్రారంభించారు.

తెలంగాణ‌లో పర‌మార జ‌గద్దేవుని శాస‌నాలు, స్ట‌కో స్క‌ప్చ‌ర్స్ ఇన్ సెంటెన‌రీ మ్యూజియం అనే పుస్త‌కాల‌తో పాటు బ్రోచర్ల‌ను మంత్రి జూప‌ల్లి ఆవిష్క‌రించారు.

International Museum Day |  వారసత్వ సంపద

ఈ సంద‌ర్భంగా మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ.. ఒక దేశ గొప్పతనం, నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ మ్యూజియాలు, వారసత్వ సంపద ద్వారానే భావితరాలకు చేరుతాయని అన్నారు.

ఎటువంటి సాంకేతిక ప‌రిజ్ఞానం, ప‌రిక‌రాలు లేని కాలంలో అద్భుతమైన కట్టడాలను మన పూర్వీకులు నిర్మించార‌ని, వాటిని చూసి తరించక పోతే జీవితం సంపూర్ణం కాదని తెలిపారు.

రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం లభించడం తెలంగాణ చరిత్రకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చిందని, ఈ వారసత్వ కట్టడాలను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక పటంలో మరింత ప్రతిష్ఠాత్మకంగా నిలపాలని ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వారసత్వ సంపద పరిరక్షణ, మ్యూజియాల అభివృద్ధి, చారిత్రక కట్టడాల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.

International Museum Day |

చారిత్రక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలలో స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు, సందర్శకులకు మెరుగైన సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా గైడ్ (Guide) ల‌కు శిక్షణ ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు. దీని కోసం రూ. 5 కోట్లు కేటాయిస్తామ‌ని చెప్పారు.

ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ స్పెష‌ల్ సీఎస్ వాణి ప్ర‌సాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆర్కియాలజీ, మ్యూజియాలజీ రంగాల్లో నూతన కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.

International Museum Day | భాగస్వాములు కావాలని..

యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని వారసత్వ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చిన్నపిల్లలు, విద్యార్థులు, యువత మ్యూజియాల‌ను సందర్శించి చరిత్రపై అవగాహన పెంచుకోవాలని కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో వ‌ర‌ల్డ్ మ‌న్యూమెంట్ ఫండ్ బోర్డు మెంబ‌ర్ షాలిని భూపాల్, ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ మెనేజింగ్ డైరెక్ట‌ర్ గౌత‌మి, ప‌ర్యాట‌క శాఖ డైరెక్ట‌ర్ లక్ష్మ‌ణ్ రంజిత్ నాయ‌క్, పురావ‌స్తు శాఖ డైరెక్ట‌ర్ అర్జున రావు, నిథ‌మ్ డైరెక్ట‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణ‌, కేంద్ర పురావ‌స్తు శాఖ సూప‌రిన్టెండెంట్ నిఖిల్ దాస్, డెక్క‌న్ హెరిటేజ్ అకాడ‌మీ ఛైర్మ‌న్ వేద కుమార్, ఇంటాచ్ (INTACH) క‌న్వీన‌ర్ అనురాధ రెడ్డి, చ‌రిత్ర‌కారులు డా. ఈమ‌ని శివ‌నాగిరెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Telangana Employee SR Digitization | ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్.. ఉత్తర్వులు జారీ

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలి..

అక్షరటుడే, ఆర్మూర్: Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని...

Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల...

Assistant Professor Merit List | మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Assistant Professor Merit List | ప్రభుత్వ మెడికల్...

Youth Drowning | ప్రాణం తీసిన ఈత సరదా.. కుంటలో మునిగి యువకుడి మృత్యువాత

అక్షరటుడే, బాన్సువాడ: Youth Drowning | ఎండ వేడిని తట్టుకోలేక స్నేహితులతో...