జాతీయంPetrol Diesel Price Hike | సామాన్యుడిపై మరో వడ్డన: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్...

Petrol Diesel Price Hike | సామాన్యుడిపై మరో వడ్డన: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

పరోక్షంగా కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులపై పడి, సామాన్యుడి బడ్జెట్ మరింత తలకిందులు కానుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Petrol Diesel Price Hike | పెరిగిన నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్న సామాన్యుడిపై ఇంధన ధరల భారం మరింత పడింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. వారం రోజుల వ్యవధిలోనే చమురు కంపెనీలు ధరలను పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

తాజా సవరణలో భాగంగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై సుమారు 90 పైసల చొప్పున రేట్లను పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

Petrol Diesel Price Hike | ఇటీవలే రూ. 3

ఇటీవలే ఇంధన ధరలు ఏకంగా రూ.3 మేర పెరిగిన విషయం విదితమే. ఆ భారం నుంచి కోలుకోకముందే.. వారం తిరక్కుండానే మళ్లీ ధరలు పెరగడం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. పెంచిన ఈ ధరలు నేటి నుంచే (మంగళవారం) అమల్లోకి రానున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ 87 పైసలు, డీజిల్‌ 91 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ.98.64, డీజిల్ రూ.91.58కు చేరింది.

  • ముంబయి: లీటర్ పెట్రోల్ రూ.107.59, డీజిల్ రూ.94.08
  • కోల్‌కతా: లీటర్ పెట్రోల్ .109.70, డీజిల్ రూ.96.07
  • చెన్నై: లీటర్ పెట్రోల్ రూ.104.49, డీజిల్ రూ.96.11

అత్యధికంగా కోల్‌కతాలో పెట్రోల్‌పై 96 పైసలు పెరిగింది.  ఆ తర్వాత ముంబయిలో పెట్రోల్‌ 91 పైసలు, డీజిల్‌ 94 పైసలు పెరిగింది. చెన్నైలో పెట్రోల్‌ 82 పైసలు, డీజిల్‌ 86 పైసలు పెరగడం గమనార్హం.

Petrol Diesel Price Hike | తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న ధరలు..

ఈ తాజా పెంపుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు సెంచరీ దాటి దూసుకుపోతున్నాయి.

హైదరాబాద్: భాగ్యనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.79 కాగా, డీజిల్ ధర రూ. 99.86 కి చేరుకుంది.

గుంటూరు: ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 113.54** కి చేరగా, డీజిల్ ధర రూ. 101.24కి పెరిగింది.

Petrol Diesel Price Hike | పెరగనున్న నిత్యావసర సరకుల ధరలు:

వారం రోజుల్లోనే రెండుసార్లు ఇంధన ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం పరోక్షంగా కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులపై పడి, సామాన్యుడి బడ్జెట్ మరింత తలకిందులు కానుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. వరుస పెంపుదలపై వాహనదారులు, ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Modi Economic Strategy | ఆర్థిక క్రమశిక్షణే ఆయుధం.. మోడీ ‘లైఫ్‌స్టైల్’ మంత్రం వెనుక దాగి ఉన్న వ్యూహం ఇదేనా?

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Car Accident | అదుపుతప్పి కారుబోల్తా.. వైద్యుడికి గాయాలు..

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Car Accident | కారు అదుపు తప్పి...

India Nordic Summit | ఇండియా – నార్డిక్​ సమ్మిట్​లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Nordic Summit | విదేశీ పర్యటనలో...

Friendly Policing | ఫ్రెండ్లీ పోలీసింగ్​పై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి : సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Friendly Policing | ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్​...

Khammam CI Harassment | మహిళపై సీఐ లైంగిక వేధింపులు.. కేసు నమోదు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khammam CI Harassment | రక్షణ కల్పించాల్సిన...