Bandi Bhagirath Case | బండి భగీరథ్ కేసులో మరో సిట్ ఏర్పాటు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhagirath Case | బండి భగీరథ్​ (Bandi Bhagirath) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు చేసిన వారి గురించి దర్యాప్తు చేసేందుకు జాయింట్ సీపీ శ్వేత ఆధ్వర్యంలో అధికారులు సిట్​ ఏర్పాటు చేశారు.

Bandi Bhagirath Case | సోషల్​ మీడియాలో అనుచిత పోస్టులు

బండి భగీరథ్​పై పోక్సో కేసు (POCSO Case) తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొదట పరారీలో ఉన్న భగీరథ్​ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్​ వేశాడు. అయితే హైకోర్టు ఆ పిటిషన్​ను కొట్టివేసింది. దీంతో భగీరథ్​ పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే బెయిల్​ పిటిషన్​ విచారణ సమయంలో కొంతమంది సోషల్​ మీడియాలో అనుచిత పోస్టులు చేశారు. నిందితుడికి బెయిల్​ ఇస్తే జడ్జి మాధవి భర్తకు బార్​ కౌన్సిల్​ ఛైర్మన్​ పదవి ఇస్తారని పోస్టులు చేశారు. దీనిపై ఇప్పటికే హైకోర్టు రిజిస్ట్రార్​ చార్మినార్​ పోలీసు (Charminar Police)లకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితులను గుర్తించేందుకు సిట్​ ఏర్పాటు చేశారు.

Bandi Bhagirath Case | జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు

కాగా ఈ కేసులో న్యాయమూర్తిపై తప్పుడు వార్తలు ప్రచారం చేసిన నెల్లూరుకు చెందిన దామోదర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోస్టులతో కేసుల పాలు ఇటీవల కొందరు సోషల్ మీడియాలో అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఏది పడితే అది పోస్టు చేస్తున్నారు. బండి భగీరథ్​ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతున్నా.. నిందితుడికి అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా పోస్టులు చేశారు. వారిలో వివాదాస్పదంగా పోస్టులు చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. భగీరథ్​కు వ్యతిరేకంగా జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు కాగా.. నిందితుడికి అనుకూలంగా బాలిక ఫొటోలు, వీడియోలు పోస్టు చేసిన సోషల్​ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లపై సైతం కేసు నమోదు అయింది.

ఇది కూడా చదవండి..: Telangana Rain Alert | పలు జిల్లాలకు వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *