జాతీయంKarnataka Border | కర్ణాటక చెత్త తెలంగాణలో డంప్​.. అడ్డుకున్న స్థానికులు

Karnataka Border | కర్ణాటక చెత్త తెలంగాణలో డంప్​.. అడ్డుకున్న స్థానికులు

తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్ణాటకలోని బీదర్​ జిల్లా నుంచి సేకరించిన చెత్తను తెలంగాణ సరిహద్దు గ్రామాల సమీపంలో పడేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Karnataka Border | తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్ణాటకలోని బీదర్​ జిల్లా నుంచి సేకరించిన చెత్తను తెలంగాణ సరిహద్దు గ్రామాల సమీపంలో పడేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లోని న్యాల్కల్ మండలం బీదర్​కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి సేకరించిన చెత్తను మండలంలోని పలు గ్రామాల సమీపంలో పడేస్తున్నారు. దీంతో స్థానికులు మంగళవారం చెత్త వాహనాలను అడ్డుకొని నిరసన తెలిపారు. చెత్తతో మండలంలోని పలు గ్రామాల్లో తీవ్ర దుర్వాసన వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Karnataka Border | అడ్డుకున్న గ్రామస్తులు

న్యాల్​కల్ మండలం మల్గి గ్రామ ప్రజలు ఆందోళన చేశారు. కర్ణాటక (Karnataka) నుంచి చెత్త తీసుకొచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. దీంతో చెత్త లోడుతో వందలాది వాహనాలు నిలిచిపోయాయ. తమ మా గ్రామాలను చెత్త కుప్పలుగా మార్చొద్దు అంటూ ప్రజలు నిరసన తెలిపారు. చెత్త వాహనాలను అడ్డుకుంటే బీదర్‌ పోలీసులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి డంపింగ్‌ యార్డ్‌ తీసివేయాలని డిమాండ్ చేశారు. చెత్తతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: ACB Raids | జలమండలి జీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆస్తులు చూసి షాకైన అధికారులు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Telangana IAS Officers| జాతీయ స్థాయిలో తెలంగాణ ఐఏఎస్ అధికారుల హవా.. ‘టాప్ 100’ జాబితాలో ముగ్గురికి చోటు

అక్షరటుడే వెబ్‌డెస్క్:Telangana IAS Officers|తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌కు జాతీయ స్థాయిలో అరుదైన...

Power Supply Disruption | గాలివాన బీభత్సం.. 24 గంటలుగా విద్యుత్​ లేక అవస్థలు..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Power Supply Disruption | మండలంలో సోమవారం సాయంత్రం...

Yellareddy Police | అన్నదాత బలవన్మరణం..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Police | అనారోగ్యంతో రైతు ఉరివేసుకుని బలవన్మరణం...

Tank Repair Works | చెరువుల మరమ్మతులపై అలసత్వం వహించొద్దు: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

అక్షరటుడే, డిచ్​పల్లి: Tank Repair Works | నియోజకవర్గంలో చెరువులు, చెక్​డ్యాంల...