సినిమాSuniel Narang Resignation| ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ హఠాత్ రాజీనామా

Suniel Narang Resignation| ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ హఠాత్ రాజీనామా

తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పదవికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ , ఏషియన్ మల్టీప్లెక్స్‌ల అధినేత సునీల్ నారంగ్ హఠాత్తుగా రాజీనామా చేశారు.

అక్షరటుబే వెబ్‌డెస్క్:Suniel Narang Resignation|తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పదవికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ , ఏషియన్ మల్టీప్లెక్స్‌ల అధినేత సునీల్ నారంగ్ హఠాత్తుగా రాజీనామా చేశారు. కేవలం కొన్ని వ్యక్తిగత కారణాల వల్లే తాను ఈ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు పేర్కొంటూ ఆయన ఛాంబర్‌కు అధికారికంగా ఒక ఈమెయిల్ పంపించారు. సునీల్ నారంగ్ తీసుకున్న ఈ అకస్మాత్తు నిర్ణయంతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. కాగా, ఈ ఖాళీ అయిన అధ్యక్ష స్థానాన్ని భర్తీ చేయడానికి శుక్రవారం రోజు(ఎల్లుండి) కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం ఎన్నిక జరగనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

Suniel Narang Resignation|పర్సంటేజీ వివాదమే కారణమా..?

పైకి వ్యక్తిగత కారణాలని చెబుతున్నప్పటికీ, ఇటీవల టాలీవుడ్‌లో థియేటర్ల లీజు వ్యవహారంలో నడుస్తున్న ‘పర్సంటేజీ విధానం’ వివాదమే ఈ రాజీనామాకు దారితీసిందనే టాక్ వినిపిస్తోంది. మల్టీప్లెక్స్‌ల తరహాలోనే సింగిల్‌ స్క్రీన్ థియేటర్లలో కూడా టికెట్ల కలెక్షన్లపై పర్సంటేజీ సిస్టమ్ అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తుండగా.. పరిశ్రమలోని అగ్ర నిర్మాతలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో ఎగ్జిబిటర్ల తరఫున నిలబడ్డ సునీల్ నారంగ్, అగ్ర నిర్మాతల నుండి గట్టిగా విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ తీవ్రమైన విభేదాలు , ఒత్తిడి వల్లే ఆయన తన పదవిని వదులుకోవడానికి మొగ్గు చూపినట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి:Banavasi Brucellosis|కర్నూలు జిల్లాలో ప్రమాదకర ‘బ్రూసెల్లోసిస్’ కలకలం.. పశువుల నుంచి మనుషులకు పాకిన జబ్బు

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Fire Accident | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Fire Accident | హైదరాబాద్​ నగరంలో గురువారం...

Visakhapatnam Infrastructure Funds|విశాఖలో 3 భారీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అక్షరటుడు వెబ్‌డెస్క్:Visakhapatnam Infrastructure Funds|విశాఖపట్నం(Visakhapatnam) నగరంలో మౌలిక వసతుల ఆధునీకరణ, పట్టణాభివృద్ధి...

Stock Market Gains | లాభాల్లో మార్కెట్లు..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Gains | పశ్చిమాసియాలో నాటకీయ పరిణామాలు...

Chandrababu Convoy | సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో కొత్త మార్పులు.. భద్రత కోసం రెండు మినీ బస్సులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chandrababu Convoy | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి...