నిజామాబాద్Yellareddy Rain Damage | ఈదురు గాలుల బీభత్సంతో నేలకొరిగిన వరి.. తడిసిన ధాన్యం..

Yellareddy Rain Damage | ఈదురు గాలుల బీభత్సంతో నేలకొరిగిన వరి.. తడిసిన ధాన్యం..

ఎల్లారెడ్డి మండలంలో రెండు రోజుల క్రితం ఈదురు గాలులు, అకాల వర్షం బీభత్సం సృష్టించాయి. గంటకు 50కి.మీ నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు వరి పంట నేలకొరిగింది.

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Rain Damage | మండలంలో (Yellareddy) రెండు రోజుల క్రితం ఈదురు గాలులు, అకాల వర్షం బీభత్సం సృష్టించాయి. గంటకు 50కి.మీ నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు వరి పంట నేలకొరిగింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలు, కుప్పలుగా పోసిన ధాన్యం పూర్తిగా ( Paddy Procurement) తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

Yellareddy Rain Damage | కోత దశలో పంటకు నష్టం..

రబీ పంట కోత దశలో ఉంది. కొందరు రైతులు పొలాల్లోనే కుప్పలు పోయగా, మరికొందరు కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఈదురు గాలులకు తోడు కురిసిన భారీ వర్షానికి పొలాల్లోని పంట తడిసి ముద్దయింది. కల్లాల్లో, రోడ్ల పక్కన ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యం రంగు మారి మొలకెత్తే ప్రమాదం ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట నేలకొరకడంతో పెట్టుబడులు కూడా దక్కవేమోనని ఆందోళన చెందుతున్నారు.

Yellareddy Rain Damage | అంధకారంలో గ్రామాలు..

గాలుల ధాటికి ఎల్లారెడ్డి – కామారెడ్డి రహదారిపై భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు, లైన్లు తెగిపడడంతో కొత్తపల్లి, తిమ్మాపూర్, హాజీపూర్, హాజీపూర్ తండా, బాలాజీ నగర్, అడవిలింగాలు, పోచంపల్లి, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోని పలు వార్డులు అంధకారంలోకి వెళ్లాయి. రాత్రంతా ప్రజలు చీకట్లోనే గడపాల్సి వచ్చింది. తాగునీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. రోడ్లపై చెట్లు పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

Yellareddy Rain Damage | శ్రమించిన ట్రాన్స్‌కో సిబ్బంది

విద్యుత్ అంతరాయం ఏర్పడిన వెంటనే ట్రాన్స్‌కో(Transco) సిబ్బంది రంగంలోకి దిగారు. రాత్రి పగలు తేడా లేకుండా తెగిపడిన లైన్లను సరిచేసి, పడిపోయిన స్తంభాలను నిలబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. చెట్లను తొలగించి మంగళవారం మధ్యాహ్నానికి చాలా గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మిగిలిన గ్రామాలకు కూడా త్వరగా విద్యుత్ ఇచ్చేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు. అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

water

ఇది కూడా చదవండి:Suryastra Rocket Test | ‘సూర్యాస్త్ర’ రాకెట్ ప్రయోగం సక్సెస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

 Tamil Nadu Cabinet Expansion | తమిళనాడు మంత్రివర్గ విస్తరణ.. ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్​కు​ మంత్రి పదవులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu Cabinet Expansion | తమిళనాడు ముఖ్యమంత్రి...

Oil Tankers in Hormuz  | భారత్ సాహసం.. హార్ముజ్ జలసంధిలోకి చమురు నౌకలు!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oil Tankers in Hormuz  | పశ్చిమాసియాలో నెలకొన్న...

Bus Stone Attack | బస్సు ఆపలేదని రాయితో దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Bus Stone Attack | బస్సు ఆపడం లేదని...