బిజినెస్​May 21 Gold Rates | మళ్లీ భ‌గ్గుమంటున్న ప‌సిడి.. హైదరాబాద్​లో తులం ధర​ ఎంతంటే!

May 21 Gold Rates | మళ్లీ భ‌గ్గుమంటున్న ప‌సిడి.. హైదరాబాద్​లో తులం ధర​ ఎంతంటే!

దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మ‌ళ్లీ పెర‌గ‌డం మొద‌లు పెట్టాయి. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో గోల్డ్ రేట్లు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. హైదరాబాద్, విజయవాడలో స్వల్ప పెరుగుదల నమోదవగా, చెన్నైలో మాత్రం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 21 Gold Rates | మహిళలు అత్యంత ఇష్టపడే ఆభరణాల్లో బంగారం మొదటి స్థానంలో ఉంటుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు లేదా చిన్న ఫంక్షన్ అయినా బంగారం కొనుగోలు చేయాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది.

అయితే ఇటీవల కాలంలో బంగారం ధరలు Gold Rates సాధారణ ప్రజలకు అందనంత స్థాయికి చేరుకుంటున్నాయి. తగ్గుతాయని ఆశించే సమయంలో మళ్లీ ధరలు పెరుగుతూ కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పులు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో గోల్డ్ రేట్లు రోజురోజుకు భారీగా మార్పులు నమోదు చేస్తున్నాయి. మే 21 గురువారం రోజున దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:

May 21 Gold Rates | హైదరాబాద్‌లో బంగారం ధర

హైదరాబాద్ Hyderabad మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.1,58,360కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరిగి రూ.1,45,160 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో కూడా హైదరాబాద్ తరహాలోనే స్వల్ప పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.1,58,360గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.1,45,160కు చేరుకుంది.

మరోవైపు చెన్నై మార్కెట్‌లో మాత్రం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి రూ.1,60,900కు చేరగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 తగ్గి రూ.1,47,490గా నమోదైంది.

May 21 Gold Rates | మరిన్ని హెచ్చుతగ్గులు

మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, యుద్ధ వాతావరణం, డాలర్ విలువలో మార్పులు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.

రానున్న రోజుల్లో కూడా గోల్డ్ రేట్లలో Gold Rates హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారు మార్కెట్ ధరలను నిరంతరం పరిశీలిస్తూ నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

May 21 Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

 Tamil Nadu Cabinet Expansion | తమిళనాడు మంత్రివర్గ విస్తరణ.. ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్​కు​ మంత్రి పదవులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu Cabinet Expansion | తమిళనాడు ముఖ్యమంత్రి...

Oil Tankers in Hormuz  | భారత్ సాహసం.. హార్ముజ్ జలసంధిలోకి చమురు నౌకలు!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oil Tankers in Hormuz  | పశ్చిమాసియాలో నెలకొన్న...

Bus Stone Attack | బస్సు ఆపలేదని రాయితో దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Bus Stone Attack | బస్సు ఆపడం లేదని...