Japan Earthquake | జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Japan Earthquake | జపాన్​లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర తీరంలో రిక్టర్ స్కేల్​పై 7.4 తీవ్రత నమోదైంది. దీంతో అధికారులు సునామీ (Tsunami) హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతంలో అలలు ఎగసి పడొచ్చని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ (Japan Meteorological Agency)  వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.54 గంటలకు భూంకంపం సంభవించింది.

శక్తివంతమైన భూకంపం తర్వాత ఉత్తర జపాన్‌లోని ఒక ఓడరేవును సోమవారం 80 సెంటీమీటర్ల (31 అంగుళాల) సునామీ అల తాకిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఇవాటేలోని కుజి ఓడరేవు వద్ద సాయంత్రం 5:34 గంటలకు ఈ అల కనిపించిందని పేర్కొంది. సునామీ అలలతో నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, “తీర ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాల నుండి వెంటనే ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది.

Japan Earthquake

Japan Earthquake | సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి

సునామీ అలలు పదేపదే తాకే అవకాశం ఉందని, హెచ్చరిక ఉపసంహరించుకునే వరకు సురక్షిత ప్రాంతాలను విడిచి వెళ్లవద్దు అని అధికారులు సూచించారు. ప్రధానమంత్రి సనాయ్ తకైచి (PM Sanae Takaichi) మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇవాటే ప్రిఫెక్చర్, హొక్కైడోలోని కొన్ని ప్రాంతాలకు 3 మీటర్ల ఎత్తు వరకు అలలు చేరవచ్చని అధికారులు హెచ్చరించారు. అంచనా వేసిన దానికంటే ముందుగా లేదా ఆలస్యంగా అలలు రావచ్చని, ఊహించిన దానికంటే ఎత్తుగా ఉండవచ్చని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Iran US Tensions | హర్ముజ్​లో మరోసారి ఉద్రిక్తత.. ఇరాన్​ నౌకపై అమెరికా కాల్పులు

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *