బిజినెస్​Stock Market India | రోజంతా ఊగిసలాట.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

Stock Market India | రోజంతా ఊగిసలాట.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ రోజంతా ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. చివరికి సెన్సెక్స్ 26 పాయింట్లు, నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో ముగిశాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market India | పశ్చిమాసియాలో తిరిగి నెలకొంటున్న జియో పొలిటికల్ టెన్షన్స్‌తో స్టాక్ మార్కెట్ (Stock Market) ఒత్తిడికి గురవుతోంది. హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద అంతరాయాలతో క్రూడ్ ఆయిల్ ధర మళ్లీ పెరిగింది. దీంతో గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ రోజంతా ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. ప్రారంభ లాభాలు ఆవిరై.. చివరికి స్వల్ప లాభాలతో ముగిసింది.

Stock Market India | లభాలతో ప్రారంభమై..

సోమవారం ఉదయం సెన్సెక్స్ 137 పాయింట్ల లాభంతో ప్రారంభమై 429 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో కోలుకుని 739 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో ప్రారంభమై 150 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 241 పాయింట్లు లాభపడింది. చివరికి సెన్సెక్స్ 26 పాయింట్ల లాభంతో 78,520 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 24,364 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market India

Stock Market India | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,840 కంపెనీలు లాభపడగా 2,548 స్టాక్స్ నష్టపోయాయి. 190 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 199 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 31 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

మిక్స్‌డ్‌గా..

నిఫ్టీలో పవర్ 1.24 శాతం, మీడియా 0.90 శాతం, యుటిలిటీ 0.88 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.55 శాతం, ఆటో ఇండెక్స్ 0.33 శాతం లాభపడగా.. ఐటీ ఇండెక్స్ 0.70 శాతం, టెలికాం 0.66 శాతం, రియాలిటీ ఇండెక్స్ 0.62 శాతం, మెటల్ 0.39 శాతం నష్టపోయాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 12 స్టాక్స్ లాభపడగా.. 18 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ట్రెంట్ 3.33 శాతం, ఎస్‌బీఐ 2.52 శాతం, ఆసియన్ పెయింట్ 2.15 శాతం, ఎన్టీపీసీ 1.08 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.08 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఎల్‌టీ 0.54 శాతం, బీఈఎల్ 1.09 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.98 శాతం, కొటక్ బ్యాంక్ 0.86 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.67 శాతం, నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: April 20 Market Analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....