అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Honda City Facelift | ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా కార్స్ ఇండియా తన పాపులర్ హైబ్రిడ్ సెడాన్ హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ 2026ను లాంచ్ చేసింది. సరికొత్త డిజైన్ మార్పులు, అధునాతన ఇంటీరియర్ ఫీచర్లు, లగ్జరీ హంగులతో వచ్చిన ఈ ప్రారంభ ధర (ఎక్స్‌షోరూమ్) రూ. 11.99 లక్షలు. మిడ్‌సైజ్ సెగ్మెంట్‌లో ఇది వోక్స్‌వ్యాగన్ వర్టస్ (Volkswagen Virtus), స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నాకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
Honda City Facelift | నాలుగు వేరియంట్లలో..
నాలుగు ప్రధాన వేరియంట్లలో (ఎస్‌వీ, వీ, జెడ్‌ఎక్స్, జెడ్‌ఎక్స్+) ఫేస్‌లిఫ్ట్‌ను ప్రవేశపెట్టింది. పాత మోడల్‌తో పోలిస్తే ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు చేయనప్పటికీ కారు వెలుపలి డిజైన్, లోపలి భాగంలో కస్టమర్లను ఆకట్టుకునేలా మార్పులు చేశారు.
Honda City Facelift | ఎక్స్‌టీరియర్ డిజైన్..
హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ (Honda City Facelift)లో ముందు భాగాన్ని పూర్తిగా మార్చేశారు. ముందు భాగంలో మరింత స్లిమ్‌గా ఉండే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్‌ను అమర్చారు. వీటికి ఐబ్రో తరహాలో రెండు భాగాలుగా ఉండే ఎల్ఈడీ డిజైన్, ఒక లైట్ బార్‌ను జత చేశారు. పాత క్రోమ్ గ్రిల్ (Chrome Grille) స్థానంలో హనీకోంబ్ ఆకారంలో ఉండే గ్రిల్‌ను అమర్చారు. ఈ సరికొత్త లైటింగ్ సిస్టమ్ ద్వారా రాత్రి వేళల్లో రోడ్డుపై చాలా దూరం వరకు స్పష్టమైన వెలుతురు కనిపిస్తుందని సంస్థ పేర్కొంటోంది. వెనక వైపు డ్యూయల్ టోన్ బంపర్, రెండువైపులా నిలువుగా ఉండే రిఫ్లెక్టర్లతో పాటు కారు బాడీ రంగులోనే ఉండే ఫాక్స్ డిఫ్యూజర్‌ను ఇచ్చారు. వీటికి అదనంగా సరికొత్త డిజైన్‌తో కూడిన పదహారు ఇంచుల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, కస్టమర్ల కోసం ఒక సరికొత్త ప్రత్యేకమైన బ్లాక్ కలర్ ఆప్షన్‌ను కూడా ప్రవేశపెట్టింది.
Honda City Facelift | ఇంటీరియర్ డిజైన్..
కారు లోపలి భాగంలో 10.1 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు. ఇది పాత స్క్రీన్ లాగా కాకుండా డ్యాష్‌బోర్డ్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చేలా దీనిని డిజైన్ చేశారు. ముందు వైపు వెంటిలేటెడ్ సీట్లున్నాయి. 360 డిగ్రీల కెమెరా సిస్టమ్‌ను జోడించారు. లగ్జరీ ఆడియో అనుభూతి కోసం ఎనిమిది స్పీకర్ల సౌండ్ సిస్టమ్, క్యాబిన్ లోపల మంచి అనుభూతిని ఇచ్చే యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఫోన్ చార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెనక విండ్‌స్క్రీన్ సన్‌షేడ్ వంటి ఫీచర్లున్నాయి.
సేఫ్టీ ఫీచర్లు : లెవెల్-2 ఏడీఏఎస్ టెక్నాలజీ, లేన్ వాచ్ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందించారు.
Honda City Facelift | ఇంజన్ సామర్థ్యం..
1.5 లీటర్ సహజసిద్ధమైన పెట్రోల్ ఇంజన్‌ను కొనసాగించారు. ఇది 121 హార్స్‌పవర్, 145 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లున్నాయి. ఎక్కువ మైలేజీ కోరుకునే వారి కోసం పవర్‌ఫుల్ హైబ్రిడ్ వెర్షన్ ఇ:హెచ్ఈవీ కూడా అందుబాటులో ఉంది. ఇది 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ కలయికతో నడుస్తూ గరిష్టంగా 126 హార్స్‌పవర్, 253 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హైబ్రిడ్ మోడల్ లీటరుకు 27.26 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని సంస్థ చెబుతోంది. హైబ్రిడ్ విడిభాగాలపై ఐదేళ్ల వారంటీని కూడా ఇస్తోంది.
ఇది కూడా చదవండి..: May 23 Gold Rates | మూడు రోజుల ర్యాలీకి బ్రేక్.. బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. పీక్స్‌లోనే వెండి!


