Adilabad Airport | ఆదిలాబాద్​ ఎయిర్​పోర్టు భూ సేకరణకు నిధులు మంజూరు

ఆదిలాబాద్​ ఎయిర్​పోర్టుకు భూ సేకరణ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Adilabad Airport | ఆదిలాబాద్​ (Adilabad) ఎయిర్​పోర్టుకు భూ సేకరణ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.2,278.14 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. డిసెంబర్‌ నాటికి భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించింది.

ఆదిలాబాద్​ ఎయిర్​పోర్టులో 2,009.23 ఎకరాల్లో ఎయిర్‌ఫీల్డ్, సివిల్ ఏవియేషన్, కార్గో, ఎంఆర్ఓ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. ఏర్పాటుతో వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. నిధుల మంజూరుతో ఉత్తర తెలంగాణ అభివృద్ధికి మరో కీలక అడుగు పడిందని తెలిపారు.

Adilabad Airport | అనుబంధ పనులకు కూడా..

ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009.23 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. 1,609.23 ఎకరాలు భారత వైమానిక దళం (IAF) అవసరాల కోసం, 400 ఎకరాలు సివిల్ ఏవియేషన్ ఎన్‌క్లేవ్, ఎంఆర్ఓ (MRO), కార్గో టెర్మినల్, హ్యాంగర్లు, భవిష్యత్ విస్తరణ అవసరాల కోసం కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న రహదారుల మళ్లింపు, 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ల తరలింపు, వాగుల మళ్లింపు, మిషన్ భగీరథ తాగునీటి పైప్‌లైన్ల మార్పు, విద్యుత్ స్తంభాల తొలగింపు వంటి అన్ని అనుబంధ పనులకు అవసరమైన నిధులను కూడా కేటాయించినట్లు వివరించారు.

Adilabad Airport | ఉత్తర తెలంగాణ అభివృద్ధి

ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ రాష్ట్రానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాజెక్టు అని కోమటిరెడ్డి పేర్కొన్నారు. భారత వైమానిక దళం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేస్తున్నాయి. విమానాశ్రయంతో ఉత్తర తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు విశేష ఊతం లభించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు.

దీనిని కూడా చదవండి : Exam Reforms Task Force | పరీక్షల సంస్కరణకు టాస్క్​ఫోర్స్​.. మరో వీడియో విడుదల చేసిన మోదీ

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *