ADR Estates MD | ఏడీఆర్​ ఎస్టేట్స్​ ఎండీకి జైలుశిక్ష.. హైకోర్టు కీలక తీర్పు

భూ వివాదం కేసులో హైకోర్టు ఏడీఆర్​ ఎస్టేట్స్​ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీతో పాటు ముగ్గురు రిజిస్ట్రేషన్​ అధికారులకు జైలు శిక్ష విధించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ADR Estates MD | భూ వివాదం కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏడీఆర్​ ఎస్టేట్స్​ ప్రైవేట్ లిమిటెడ్​ మేనేజింగ్​ డైరెక్టర్​(ఎండీ), ముగ్గురు రిజిస్ట్రేషన్​ అధికారులకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

మేడ్చల్ జిల్లా (Medchal District)లోని బచుపల్లిలో 10 ఎకరాల భూ వివాదంలో మధ్యంతర కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినందుకు కోర్టు వారిని దోషులుగా నిర్ధారించింది. జస్టిస్ కునూరు లక్ష్మణ్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం, కోర్టు ధిక్కరణకు పాల్పడిన నలుగురికి ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున జరిమానా కూడా విధించింది.

ADR Estates MD | సర్వే నంబర్​ 140లో..

బాచుపల్లి గ్రామంలోని సర్వే నెం.140లో ఉన్న మొత్తం 17 ఎకరాల 10 గుంటల భూమిలో 10 ఎకరాలకు సంబంధించి వివాదం ఉంది. 2023 ఫిబ్రవరిలో వెలువడిన ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ ఏపీలోని గుడివాడకు చెందిన చలసాని కల్యాణిలీల కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం ఏడీఎర్​ ఎండీతో పాటు ముగ్గురు అధికారులకు జైలు శిక్ష విధించింది. అయితే దీనిపై అప్పీల్‌కు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును 4 వారాలపాటు నిలిపివేసింది.

ఇది కూడా చదవండి..: Telangana Activist Laxman | ప్రభుత్వ తీరుతోనే ఉద్యమకారుడు లక్ష్మణ్​ ఆత్మహత్య : హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *