అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Activist Laxman | తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ మృతి చాలా బాధాకరం, దురదృష్టకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. ఆయన మృతి ఎంతగానో కలచి వేసిందని పేర్కొన్నారు.
జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో ఇటీవల మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని హరీశ్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి మంగళవారం పరామర్శించారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించారు. లక్ష్మణ్ భార్యకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా తానే తీసుకుంటానని రాజేశ్వర్ రెడ్డి చెప్పారన్నారు.
Telangana Activist Laxman | వేధింపులతో..
కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకుల వేధింపులతో లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకున్నాడని హరీశ్‌రావు ఆరోపించారు. ఆయనపై మైనింగ్ కేసు పెట్టి, జేసీబీ సీజ్ చేశారన్నారు. నెలలుగా దానిని విడుదల చేయకపోవడంతో పాటు జరిమానాలు వేయడంతో లక్ష్మణ్‌కు అప్పులు పెరిగాయన్నారు. లక్ష్మణ్ తనకున్న 7 ఎకరాలతో పాటు ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసేవాడని చెప్పారు. అయితే ఈ ఏడాది చెరువులోకి నీరు రాకపోవడంతో పంట ఎండిపోయి అప్పుల పాలు అయ్యాడన్నారు. మరోవైపు ఆయన సొంత భూమిని కాంగ్రెస్ నాయకుడి పీఆర్వో చెప్పడంతో అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారన్నారు. దీంతో మనస్తాపం చెంది లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Onion Prices | తెలంగాణలో సెంచరీకి చేరువలో ఉల్లి ధర.. సామాన్యుడి జేబుకు చిల్లు