అక్షరటుడే, వెబ్‌డెస్క్: Beed Car Accident | బీజేపీ కార్పొరేటర్ కుమారుడి కారు ఢీకొని దంపతులు మృతి చెందారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మైనర్ అయిన కార్పొరేటర్ కుమారుడు అతివేగంగా కారు నడపడంతో ప్రమాదం చోటు చేసుంది.
మహారాష్ట్ర (Maharashtra)లోని బీడ్ జిల్లాలో ఈ నెల 20న రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ కార్పొరేటర్ దీపక్ మెండ్కే కుమారుడు మైనర్ అయిన దక్ష్ మెండ్కే ఆ సమయంలో కారు నడుపుతున్నట్లు గుర్తించారు. ప్రహ్లాద్ గైక్వాడ్, సునీతా గైక్వాడ్ దంపతులు బైక్‌పై వెళ్తుండగా.. కారు అతివేగంగా వచ్చి వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ అక్కడికక్కడే మరణించగా, ఆసుపత్రికి తరలిస్తుండగా సునీత చనిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
Beed Car Accident | రెచ్చిపోతున్న మైనర్లు
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు చెబుతున్నా ఎవరు వినడం లేదు. మైనర్లు బైక్‌లతో ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తున్నారు. కార్లను అతివేగంగా నడుపుతున్నారు. ఇటీవల మైనర్లు వాహనాలు నడపడంతో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కేరళంలో కొన్ని రోజుల క్రితం జడ్జి కుమారుడు కారుతో ఢీకొనడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. లగ్జరీ కార్లలో అతివేగంగా వెళ్తూ ప్రమాదాలు చేస్తున్న వారిలో ధనవంతులు, అధికారులు, నాయకుల పిల్లలే అధికంగా ఉంటున్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Bhopal House Demolitions | భోపాల్‌లో భారీగా ఇళ్ల కూల్చివేతలు