అక్షరటుడే వెబ్‌డెస్క్: Bigg Boss Telugu 10 | బిగ్ బాస్ ( Bigg Boss ) తెలుగు 10 హౌస్‌లో జరుగుతున్న మహాపరీక్ష ప్రేక్షకులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. సాధారణంగా జరిగే వారాంతపు ఎలిమినేషన్‌కు భిన్నంగా, ఈసారి ఏకంగా వారం మధ్యలోనే (మిడ్-వీక్) ఒక ఎలిమినేషన్ జరగనుండటం హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Bigg Boss Telugu 10 | పెరుగుతున్న విభేదాలు..
తాజా సమాచారం ప్రకారం, హౌస్‌లో సామాన్యుడిగా అడుగుపెట్టిన కంటెస్టెంట్ ఆర్జే చరణ్ డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, హౌస్‌లో మాత్రం ఆ విభజన స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు త్రిగుణ్, రోహిత్‌ల మధ్య పెరుగుతున్న విభేదాలు ఆటను మరింత రంజుగా మారుస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడైన చరణ్ ఊహించని విధంగా మిడ్-వీక్ ఎలిమినేషన్‌కు గురయ్యే అవకాశం ఉందన్న వార్త ప్రేక్షకులను విస్మర్యానికి గురిచేస్తోంది. మహాపరీక్షలో ఆర్జే చరణ్ తొలి బాధితుడు అవుతాడా? లేక బిగ్ బాస్ ఏదైనా అనూహ్య మలుపు తిప్పుతాడా? అనేది తేలనుంది.
ఇది కూడా చదవండి: Nizamabad Water Resources | నీటి వనరులు వృథా కాకుండా చూడాలి..