Cylinder Price Hike | మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cylinder Price Hike | దేశంలో కమర్షియల్ సిలిండర్​ ధరలు (Cylinder Prices) మరోసారి పెరిగాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇటీవల గ్యాస్​, ఇంధన ధరలను కేంద్రం పెంచుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గృహ వినియోగదారులు వినియోగించే సిలిండర్ల ధరలను కేంద్రం పెంచలేదు.

Cylinder Price Hike

పెరిగిన సిలిండర్ ధరలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై ఢిల్లీలో రూ.42 పెరిగింది. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్‌ ధర రూ.3,113.50 చేరింది. కోల్‌కతాలో రూ.3,255.50, హైదరాబాద్‌లో ధర రూ.3,367గా ఉంది. హైదరాబాద్​లో తాజాగా సిలిండర్ ధర రూ.52 పెరిగింది. 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్‌ పైనా రూ.11 పెంచుతున్నట్ఉల ప్రభుత్వం తెలిపింది.

Cylinder Price Hike | యుద్ధం ప్రభావంతో..

అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాణిజ్య ఎల్పీజీ ధరలు తాజాగా పెరిగాయి. హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా ముడి చమురు, గ్యాస్ సరఫరాలకు అంతరాయంతో ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు, గ్యాస్​ ధరలు పెరుగుతున్నాయి. ఇటీవలి నెలల్లో వాణిజ్య ఎల్‌పీజీ విభాగంలో ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు కనిపించాయి. మే నెలలో, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ల ధరను దాదాపు రూ.1,000 పెంచాయి, దీంతో ఢిల్లీ ధర ఒక్కో సిలిండర్‌కు రూ.3,071.50కి చేరింది. అంతకు ముందు ఏప్రిల్‌లో ధరలు రూ.195.5, మార్చిలో రూ.114.5 పెరిగాయి.

Cylinder Price Hike | తీవ్ర ప్రభావం

Cylinder Price Hike

వాణిజ్య సిలిండర్ల ధరల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా టిఫిన్​ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లపై భారం పడుతోంది. దీంతో వారు దీనిని వినియోగదారులపై మోపుతున్నారు. ఇప్పటికే అన్ని టిఫిన్​ సెంటర్లలో రేట్లను భారీగా పెంచారు. హోటల్​లో భోజనం ధరలు కూడా పెరిగాయి. హాస్టళ్లు రెంట్లు సైతం పెరగడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇది కూడా చదవండి..: Ayodhya Kashi Tour | అయోధ్య, కాశి పుణ్య క్షేత్ర యాత్ర.. టూర్ ప్యాకేజీతో ముందుకొచ్చిన ఐఆర్‌సీటీసీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *