E20 Janata Party | ఈ–20 జనతా పార్టీ ఏర్పాటు.. గడ్కరీ రాజీనామా చేయాలని డిమాండ్

ఈ 20 పెట్రోల్​కు వ్యతిరేకంగా ఇన్​స్టాగ్రామ్​లో ఈ 20 జనతా పార్టీ ఏర్పాటు అయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: E20 Janata Party | దేశంలో మరో వ్యంగ్య రాజకీయ పార్టీ ఏర్పాటు అయింది. కాక్రోచ్​ జనతా పార్టీ (Cockroach Janata Party) నిరసనలతో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జెన్​జీ యువత ఇన్​స్టాగ్రామ్​ వేదికగా.. ఈ 20 జనతా పార్టీని ఏర్పాటు చేశారు.

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్​లో ఇథనాల్​ కలుపుతున్న విషయం తెలిసిందే. గతంలో 10 శాతం ఇథనాల్​ కలుపగా.. ఇటీవల దానిని 20 శాతానికి పెంచింది. దేశవ్యాప్తంగా ఈ 20 పెట్రోల్​ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో వాహనాలు పాడవుతాయని యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇథనాల్ మిశ్రమ ఇంధనానికి వ్యతిరేకంగా ‘ఈ20 జనతా పార్టీ’ని కొందరు ఏర్పాటు చేశారు.

E20 Janata Party | 2 లక్షల ఫాలోవర్లు

ఈ20 పార్టీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ సంఖ్య వేగంగా పెరుగుతోంఇ. తక్కువ ధరకు 100 శాతం అసలైన ఇంధనాన్ని ఎంచుకునే స్వేచ్ఛను, ఈ20 ఇంధనంపై డిజిటల్ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలని ఈ పార్టీ డిమాండ్ చేస్తోంది. E20 ఇంధనం వల్ల మైలేజీ తగ్గుతుందని, వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

E20 Janata Party | వెనక్కి వెళ్లేది లేదు

ఈ 20 పెట్రోల్ సురక్షితమైనదని, ఇంజిన్లకు ఎలాంటి నష్టం కలగదని కేంద్రం చెబుతుంది. E10 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే వాహనాల్లో E20 ఇంధనాన్ని వాడినప్పుడు మైలేజీలో స్వల్ప తగ్గుదల ఉండవచ్చని ప్రభుత్వం అంగీకరించింది. తిరిగి వందశాతం ప్యూర్​ పెట్రోల్​ వైపు వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేసింది. పూర్తిగా ఈథనాల్​తో నడిచే (ఈ 85) ఫ్లెక్స్​ ఫ్యూయల్​ వైపు కేంద్రం అడుగులు వేస్తోంది. కాక్రోచ్​ జనతా పార్టీ విజయవంతం కావడంతో E20 పార్టీ ఆవిర్భావానికి ప్రాముఖ్యత పెరిగింది.ఢిల్లీ టాక్సీ, పర్యాటక, టూర్ ఆపరేటర్ల సంఘం ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించి, ఆగస్టు 4న పార్లమెంటుకు పాదయాత్రను ప్రకటించింది. E20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా, అలాగే వాణిజ్య వాహనాల్లో జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు, పానిక్ బటన్లను తప్పనిసరిగా అమర్చడాన్ని వ్యతిరేకిస్తూ జరిగే ఈ నిరసనలో టాక్సీ ఆపరేటర్లు, పర్యాటక వాహనాల యజమానులు మరియు ఇతర వాణిజ్య వాహన ఆపరేటర్లు పాల్గొంటారని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Supreme Court SC Status | మతం మార్చుకుంటే ఎస్సీ హోదా కోల్పోతారు.. సుప్రీంకోర్టు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *