Festival Security Arrangements | పండగల నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి..: సీపీ సాయిచైతన్య

పండగల నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ సాయిచైతన్య ఆదేశాలు జారీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Festival Security Arrangements | పండగల నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ సాయిచైతన్య(CP Saichaitanya) ఆదేశాలు జారీ చేశారు. బోధన్(Bodhan)​ నియోజకవర్గంలో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు.

Festival Security Arrangements | డ్రగ్స్​, సైబర్​ నేరాల నియంత్రణకు..

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణ కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులు, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజలలో రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. పాత నేరస్థులపై నిఘా పెట్టాలని.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిర్విరమంగా దాడులు నిర్వహించాలని సూచించారు.అవసరం అయితే పీడీ యాక్ట్ నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

Festival Security Arrangements | డయల్ 112 గురించి ముమ్మరంగా ప్రచారం చేయాలి

డయల్​ 112ను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలని సీపీ పేర్కొన్నారు. బోధన్ డివిజన్ పరిధిలో నమోదైన వివిధ రకాల కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా హత్య, హత్యాయత్నం, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్ మరియు గంజాయి అక్రమ రవాణా, పేకాట, గుట్కా అక్రమ వ్యాపారం వంటి కేసులపై ప్రత్యేకంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరిత న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్,సీసీఆర్​బీ ఏసీపీ గురునాయుడు, ఇన్​స్పెక్టర్​ అంజయ్య, సీఐలు, ఎస్​హెచ్​వోలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : తెలుగు వాళ్లను వదలను.. – హీరో కార్తీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *