FIFA World Cup 2026 | నేటి నుంచే ఫిఫా వరల్డ్ కప్

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫిపా వరల్డ్​ కప్​ నేడు మొదలు కానుంది. తొలిమ్యాచ్​ మెక్సికో, సౌతాఫ్రికా మధ్య జరగనుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : FIFA World Cup 2026 | ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫిపా వరల్డ్​ కప్​ నేడు మొదలు కానుంది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి అతిథ్యం ఇవ్వనున్నాయి.

ఫిపా వరల్డ్​ కప్​ (FIFA World Cup) చరిత్రలోనే తొలిసారిగా ఈ సారి మొత్తం 48 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. తొలి మ్యాచ్​లో ఆతిథ్య మెక్సికో జట్టుతో సౌతాఫ్రికా తలపడనుంది. గ్రూప్​ దశ మ్యాచ్​లు ఈ నెల 11 నుంచి 27 వరకు జరుగుతాయి. రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్​లు జూన్ 28 – జూలై 3 వరకు, రౌండ్ ఆఫ్ 16 జూలై 4–7 వరకు జరగనున్నాయి. క్వార్టర్​ ఫైనల్స్​ జూలై 9–11 వరకు, సెమీ ఫైనల్స్ జూలై 14–15, మూడో స్థానం మ్యాచ్: జూలై 18న, ఫైనల్ జూలై 19న జరగనుంది.

FIFA World Cup 2026 | గత టోర్నీ విజేత అర్జెంటినా

ఫిఫా వరల్డ్ కప్ 2022లో జరిగింది. ఖతార్​లో జరిగిన ఈ టోర్నీలో అర్జెంటినా విజేతగా నిలిచింది. ఫైనల్లో ఫ్రాన్స్​పై పెనాల్టీల్లో 4–2 తేడాతో ఓడించి తమ మూడో ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. కాగా ప్రస్తుతం మ్యాచ్​లు భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి జరగనున్నాయి.

ఇది కూడా చదవండి..: India vs Afghanistan Test | విజృంభించిన భారత బౌలర్లు.. ఫాలో ఆన్​ ఆడుతున్న అఫ్గాన్​ జట్టు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *