Goa Police Inspector Rape | విచారణ పేరుతో దారుణం.. మైనర్‌ బాలికపై ఇన్‌స్పెక్టర్ అత్యాచారం

గోవాలో రక్షక భటుడే రాక్షసుడిగా మారిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Goa Police Inspector Rape | గోవాలో రక్షక భటుడే రాక్షసుడిగా మారిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ మోసంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఓ మైనర్ బాలికపై, విచారణ పేరుతో నమ్మించి పోలీస్ ఇన్‌స్పెక్టరే పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కిరాతకం ఆలస్యంగా బయటపడింది.

Goa Police Inspector Rape | చైల్డ్ హెల్ప్‌లైన్ ఫిర్యాదు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 16 ఏళ్ల బాలిక సైబర్ మోసానికి గురికావడంతో గతేడాది జులైలో ‘చైల్డ్ హెల్ప్‌లైన్’ను సంప్రదించి ఫిర్యాదు చేసింది. ఆ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వికాస్ దేకర్.. విచారణ జరపాలనే సాకుతో బాలికను రాత్రి వేళల్లో క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి పిలిపించుకున్నాడు. ఆ సమయంలో తనపై ఇన్‌స్పెక్టర్ రెండుసార్లు లైంగిక దాడులకు పాల్పడినట్లు బాధిత బాలిక ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది.

Goa Police Inspector Rape | సీసీటీవీలో దొరికిపోయిన నిందితులు..

బాలిక ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు.. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలించారు. ఆ ఫుటేజీలో బాధిత బాలికను ఓ మహిళ నేరుగా ఇన్‌స్పెక్టర్ గదిలోకి తీసుకువెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో ఆ ఇన్‌స్పెక్టర్‌తో పాటు సహకరించిన ఆ మహిళపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Goa Police Inspector Rape | గుట్టుగా కెమెరాలు కప్పి..

తమ అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు ఇన్‌స్పెక్టర్ క్యాబిన్ లోపల ఉన్న సీసీటీవీ ( CCTV )కెమెరాలను నిందితులు ఒక వస్త్రంతో కప్పివేసినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.

ఇది కూడా చదవండి:  Kamareddy Open Plots | వెంచర్లలో ‘ఓపెన్​ స్థలాల’ దందా.. పట్టించుకోని బల్దియా

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *