BRS Party Rejoinings | తెలంగాణ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్.. కేటీఆర్‌పై వ్యాఖ్యలు విత్‌డ్రా చేసుకున్న కొండా సురేఖ

రాబోయే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ రాజకీయం వేగంగా మారుతోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: BRS Party Rejoinings | రాబోయే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ  ( Telangana )రాజకీయం వేగంగా మారుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ తమ సంక్షేమ పథకాలే విజయానికి మార్గమని ధీమా వ్యక్తం చేస్తుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు అధికారాన్ని దక్కించుకోవడానికి కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే ఈ రాజకీయ సమీకరణాల మధ్య, బీఆర్ఎస్‌లోకి పాత నేతలు మళ్లీ తిరిగి రాబోతున్నారనే ప్రచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ చేరికల ఊహాగానాలే ఇప్పుడు గులాబీ పార్టీలో కొత్త అసమ్మతి జ్వాలలు రేపుతున్నాయి.

BRS Party Rejoinings | కొండా సురేఖ క్షమాపణలు..

రాజకీయాల్లో నాయకులు పార్టీలు మారడం సాధారణమే అయినా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కొండా సురేఖ ఉపసంహరించుకోవడం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన సురేఖ.. తిరిగి ‘కారు’ ఎక్కేందుకే తన వ్యాఖ్యలను విత్‌డ్రా చేసుకున్నారని, కేటీఆర్‌కు క్షమాపణ చెప్పారనే ప్రచారం మొదలైంది. అంతేకాకుండా, మరికొందరు కాంగ్రెస్ నాయకులు కూడా బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అధిష్టానం లేదా సదరు నేతల నుంచి అధికారిక స్పష్టత రానప్పటికీ, ఈ చేరికల వ్యవహారం గులాబీ దళానికి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది.

BRS Party Rejoinings | కార్యకర్తలకు అన్యాయమేనా?

ఈ చేరికల వార్తలపై బీఆర్ఎస్ పాత మద్దతుదారులు, సొంత క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అనుభవించి, కష్టకాలంలో పార్టీని వీడి ఇబ్బందులకు గురిచేసిన నేతలను మళ్లీ పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ జెండాను భుజాన ఎత్తుకుని నిలబడిన నాయకులకు, కార్యకర్తలకు ఈ నిర్ణయం ఎలాంటి సందేశాన్నిస్తుందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. పార్టీని మోసం చేసి వెళ్లినవారిని మళ్లీ చేర్చుకోవడం ఎంతవరకు సమంజసమంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర పరుష పదజాలంతో అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.

BRS Party Rejoinings | తీవ్ర ఒత్తిడి..

అధికారం కోల్పోవడం ఒకెత్తయితే, సీఎం రేవంత్ రెడ్డి దూకుడు మరియు గత ప్రభుత్వ హయాం నాటి అంశాలపై నడుస్తున్న విచారణలతో బీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో పాత నేతల చేరికలను కేడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం రాబోయే ఎన్నికల నాటికి అధినేత కేసీఆర్‌కు మరో సవాలుగా మారింది. చేరికలను ప్రోత్సహించి బలాన్ని పెంచుకోవాలా? లేక కష్టకాలంలో నిలబడిన కార్యకర్తల మనోభావాలకు ప్రాధాన్యమివ్వాలా? అనే అంశంపై కేసీఆర్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి:  Kamareddy Open Plots | వెంచర్లలో ‘ఓపెన్​ స్థలాల’ దందా.. పట్టించుకోని బల్దియా

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *