HDFC BSE REITs Fund | హెచ్‌డీఎఫ్‌సీ నుంచి కొత్త ఇండెక్స్ ఫండ్.. వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు అవకాశం

భారతీయ మ్యూచువల్ ఫండ్ రంగంలో అగ్రగామిగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ (HDFC MF) మరో వినూత్న పథకంతో ముందుకు వచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: HDFC BSE REITs Fund | భారతీయ మ్యూచువల్ ఫండ్ రంగంలో అగ్రగామిగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ (HDFC MF) మరో వినూత్న పథకంతో ముందుకు వచ్చింది. ఇటీవల ముగిసిన ఎన్ఎఫ్‌ఓ (NFO) ప్రక్రియ తర్వాత ‘హెచ్‌డీఎఫ్‌సీ బీఎస్‌ఈ రియట్స్ అండ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్  ( Real Estate )ఇండెక్స్ ఫండ్’ (HDFC BSE REITS and Commercial Real Estate Index Fund) ను నిరంతర పెట్టుబడుల (Ongoing Subscription) కోసం తిరిగి తెరిచినట్లు ప్రకటించింది. దేశంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న వాణిజ్య రియల్ ఎస్టేట్ (Commercial Real Estate) రంగంలో మదుపర్లు సులభంగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ పాసివ్ ఫండ్ దోహదపడుతుందని సంస్థ వెల్లడించింది.

HDFC BSE REITs Fund | ప్రత్యేక బెంచ్‌మార్క్..

ఈ పథకం ‘బీఎస్‌ఈ రియట్స్ అండ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ (TRI)’ పనితీరును ట్రాక్ చేస్తూ ముందుకు వెళుతుంది. లిస్టెడ్ రియట్స్ (REITs) తో పాటు అద్దె ఆదాయం ఆధారంగా వ్యాపారం నిర్వహించే ప్రముఖ కమర్షియల్ రియల్ ఎస్టేట్ కంపెనీలను ఈ ఇండెక్స్ కవర్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ స్ట్రక్చర్ ద్వారా మదుపర్లకు ఇన్‌స్టిట్యూషనల్ క్వాలిటీ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోజర్‌ను మరింత చేరువ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం.

HDFC BSE REITs Fund | సులభమైన అవకాశం..

సాధారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టాలంటే భారీ మొత్తాలు అవసరమవుతాయి. అయితే ఈ మ్యూచువల్ ఫండ్ ద్వారా చాలా తక్కువొక మొత్తంతోనే ప్రొఫెషనల్స్ నిర్వహించే వాణిజ్య ఆస్తుల్లో భాగస్వామ్యం పొందవచ్చు. సాంప్రదాయ అసెట్ క్లాస్‌లతో పోలిస్తే కమర్షియల్ రియల్ ఎస్టేట్ ద్వారా భిన్నమైన రాబడులను ఆశించే మదుపర్లకు ఇది మంచి డైవర్సిఫికేషన్ ఆప్షన్‌గా నిలుస్తుంది. అంతేకాకుండా, పూర్తియిన రియల్ ఎస్టేట్ ఆస్తుల మానిటైజేషన్‌కు, దీర్ఘకాలిక మూలధన ఆకర్షణకు రియట్స్ దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

HDFC BSE REITs Fund | పెట్టుబడి అవకాశాలను..

ఈ కొత్త పథకంపై హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎండీ, సీఈఓ నవనీత్ మునోత్ స్పందిస్తూ.. భారతీయ మదుపర్లకు వినూత్న పెట్టుబడి అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగానే ఈ ఫండ్‌ను తెచ్చినట్లు తెలిపారు. ప్రతి భారతీయుడిని సంపద సృష్టికర్తగా మార్చడమే తమ ధ్యేయమన్నారు. పాసివ్ వ్యూహాల్లో తమకు ఉన్న 20 ఏళ్లకు పైగా అనుభవంతో మదుపర్లకు దీర్ఘకాలిక రియల్ ఎస్టేట్ వృద్ధి ఫలాలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  Khairatabad Bypoll | ఖైరతాబాద్ ఉపఎన్నిక.. కిషన్ రెడ్డికి మరో అగ్నిపరీక్ష..!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *