Himanshu Bhau Arrest | మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భావు అరెస్ట్

మోస్ట్​ వాంటెండ్​ గ్యాంగ్​స్టర్​ హిమాన్షు భావును అమెరికాలో పోలీసులు అరెస్ట్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Himanshu Bhau Arrest | మోస్ట్​ వాంటెండ్​ గ్యాంగ్​స్టర్​ హిమాన్షు భావును అమెరికాలో పోలీసులు అరెస్ట్​ చేశారు. లారెన్స్‌ బిష్ణోయ్‌ (Lawrence Bishnoi)కు ప్రత్యర్థి అయిన అతడిపై భారత్​లో అనేక కేసులు ఉన్నాయి. పోర్చుగల్ నుంచే గ్యాంగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న హిమాన్షును ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుంది.

భారత్​లో హత్యలు, వ్యవస్థీకృత నేరాలకు సంబంధించి వాంటెడ్ జాబితాలో ఉన్న గ్యాంగ్‌స్టర్లు హిమాన్షు భావు, నీరజ్ ఫరీద్‌పురియాలను అమెరికాలో అరెస్టు చేశారు. హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) అందించిన సమాచారం మేరకు అక్టోబర్ 22న లాస్ వేగాస్‌లో వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరిని భారత్‌కు రప్పించేందుకు (హర్యానా STF అధికారులు అమెరికా అధికారులతో, కేంద్ర దర్యాప్తు సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Himanshu Bhau Arrest | అనేక కేసులు

హిమాన్షు భావు ‘హిమాన్షు సిగ్రోహా’ అనే పేరుతో పాస్‌పోర్ట్ పొందాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు ప్రత్యర్థి అయిన హిమాన్షు భావు, హర్యానా, ఢిల్లీ పోలీసుల ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాలో ఉన్నాడు. అతడితో పాటు అనుచరులపై హత్యలు, కిడ్నాప్‌లు, బలవంతపు వసూళ్లు వంటి అనేక కేసులు నమోదయ్యాయి. హర్యానాలోని పల్వాల్ జిల్లాకు చెందిన నీరజ్ ఫరీద్‌పురియా కూడా అరెస్టు సమయంలో అమెరికాలోనే ఉంటున్నాడు. ఇతనిపై 25కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి..: Trump Iran Warning | ఇరాన్​పై భీకర దాడులు చేస్తాం.. ట్రంప్​ హెచ్చరిక

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *