Ibrahimpatnam Land Scam | తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. రూ.50 కోట్ల ప్రభుత్వ భూమి గోల్‌మాల్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:  Ibrahimpatnam Land Scam | రంగారెడ్డి జిల్లా  (  Ranga Reddy ) ఇబ్రహీంపట్నం మండలంలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో భూ సమస్యలు, 22ఏ నిషేధిత భూముల వివాదాలు నడుస్తున్న తరుణంలో.. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరున పట్టా చేసిన వైనం తీవ్ర కలకలం రేపుతోంది. ఏకంగా తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ అక్రమాలకు పాల్పడటం స్థానికంగా సంచలనం సృష్టించింది.

Ibrahimpatnam Land Scam | రూ.50 కోట్ల భూమి గోల్‌మాల్‌..

ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మంగళ్‌పల్లి గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర బట్టబయలైంది. మంగళ్‌పల్లి శివారులోని 4.25 ఎకరాల ప్రభుత్వ భూమిని వహీదా బేగం అనే వ్యక్తి పేరుతో అక్రమంగా పట్టా చేశారు. అంతేకాకుండా దీనికి సంబంధించి అధికారికంగా పట్టా పాస్‌పుస్తకం కూడా జారీ చేయడం గమనార్హం. ప్రభుత్వ భూమికి ఎలాంటి హక్కులు లేకపోయినా, రికార్డులను మార్చి ప్రైవేటు పరం చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Ibrahimpatnam Land Scam | ఫోర్జరీ సంతకంతో నకిలీ పత్రాలు..

ఈ మొత్తం వ్యవహారం నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఫోర్జరీ సంతకంతోనే రికార్డుల్లో మార్పులు చేసి పాసుపుస్తకం జారీ చేసినట్లు వెల్లడైంది. ఈ భూమి మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వ భూమికి ఇటువంటి పట్టాలు ఎలా జారీ అయ్యాయనే దానిపై రెవెన్యూ అధికారులు తీవ్రంగా దృష్టి పెట్టారు. పాత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఈ పాస్‌పుస్తకాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.

ఇది కూడా చదవండి:  Tandur Boxing Student | రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు తాండూర్ విద్యార్థి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *