ICICI Life Signature Pension | ఐసీఐసీఐ లైఫ్ కొత్త పెన్షన్ ప్లాన్.. 60% నిధి పన్ను రహితంగా విత్‌డ్రా..

పదవీ విరమణ అనంతరం ఆర్థిక ఒత్తిడి లేని జీవితాన్ని గడపడంతో పాటు, తదుపరి తరానికి పన్ను రహిత వారసత్వ సంపదను అందించే లక్ష్యంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 'ఐసీఐసీఐ లైఫ్ సిగ్నేచర్ పెన్షన్' పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: ICICI Life Signature Pension | పదవీ విరమణ అనంతరం ఆర్థిక ఒత్తిడి లేని జీవితాన్ని గడపడంతో పాటు, తదుపరి తరానికి పన్ను రహిత వారసత్వ సంపదను అందించే లక్ష్యంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘ఐసీఐసీఐ లైఫ్ సిగ్నేచర్ పెన్షన్’ (ICICI Life Signature Pension) పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్ ఆధారిత రాబడుల ద్వారా దీర్ఘకాలిక సంపదను సృష్టించుకునేలా, పాక్షిక విత్‌డ్రాయల్స్ వెసులుబాటుతో ఈ ప్లాన్‌ను రూపొందించారు.

ICICI Life Signature Pension | 90 ఏళ్ల వరకు వెస్టింగ్ వయసు..

ఈ పథకం కింద కస్టమర్లు తమ 40వ ఏట నుంచే రిటైర్మెంట్ ప్రణాళికలను ప్రారంభించవచ్చు. పాలసీ వ్యవధి , వెస్టింగ్ వయసు గరిష్టంగా 90 ఏళ్ల వరకు ఉండటంతో, దీర్ఘకాలం పాటు పెట్టుబడులను కొనసాగించి కాంపౌండింగ్ ప్రయోజనాలను పొందే వీలుంటుంది. వివిధ ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు, పాలసీ టర్మ్ ఎంపికలతో పాటు 100 శాతం ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు బహుళ ఫండ్ ఆప్షన్లను కూడా సంస్థ కల్పిస్తోంది.

ICICI Life Signature Pension |విత్‌డ్రా చేసుకునే అవకాశం..

రిటైర్మెంట్ ( Retirement ) , వారసత్వ ప్రణాళికలు సాధారణంగా సంక్లిష్టంగా, పన్ను భారంతో కూడుకుని ఉంటాయని ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ వికాస్ గుప్తా పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా పాలసీ నిధులు చేతికి అందే (వెస్టింగ్) సమయంలో పోగుపడిన నిధిలో 60 శాతం వరకు మొత్తాన్ని ఎలాంటి పన్ను లేకుండా విత్‌డ్రా చేసుకుని తదుపరి తరానికి అందించవచ్చని తెలిపారు. మిగిలిన 40 శాతం మొత్తంతో యాన్యుటీ పథకాన్ని కొనుగోలు చేయడం ద్వారా జీవితాంతం కచ్చితమైన పింఛను ఆదాయాన్ని పొందవచ్చని వివరించారు.

ICICI Life Signature Pension | జాయింట్ లైఫ్ రక్షణ..

పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణిస్తే, చెల్లించిన మొత్తం ప్రీమియంలలో 105 శాతం లేదా ప్రస్తుత ఫండ్ విలువలో ఏది ఎక్కువైతే దానిని డెత్ బెనిఫిట్ కింద నామినీకి చెల్లిస్తారు. జాయింట్ లైఫ్ ప్రాతిపదికన పాలసీ తీసుకున్నట్లయితే, ప్రైమరీ పాలసీదారు మరణానంతరం తదుపరి ప్రీమియంలు మాఫీ (వెయివర్ ఆఫ్ ప్రీమియం) అయి, సెకండరీ లైఫ్ అష్యూర్డ్ పేరుతో పాలసీ కొనసాగుతుంది. వారి తదనంతరం నామినీకి డెత్ బెనిఫిట్ అందుతుంది.

బహుళ నామినీల నియామకం, వాటాల కేటాయింపు..
తమ వారసత్వ సంపద పంపిణీలో స్పష్టత ఉండేలా కస్టమర్లు ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా నియమించుకోవచ్చు. అంతేకాకుండా ఒక్కో నామినీకి పాలసీ ప్రయోజనాల్లో ఎంత శాతం వాటా అందాలో ముందుగానే నిర్దేశించే వెసులుబాటును కూడా ఈ పథకం అందిస్తోంది.

ఇది కూడా చదవండి: Lakshmi Narasimha Swamy Kalyanam | కమనీయం.. లక్ష్మీనృసింహుని కల్యాణం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *