Indiramma Towers  | ‘ఇందిరమ్మ టవర్స్‌’లో ప్లాట్ల కోసం విశేష స్పందన..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

నగరంలోని నాగారం ప్రాంతం ఆర్‌జీకే కాలనీలో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్​లో ప్లాట్లకు విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్​ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Indiramma Towers | నగరంలోని నాగారం ప్రాంతం ఆర్‌జీకే కాలనీలో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్​లో ప్లాట్లకు విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఇందిరమ్మ టవర్స్‌’కు డిసెంబర్​ 5లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Indiramma Towers | నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో..

నగర పాలక సంస్థ పరిధిలో నివసిస్తున్న అర్హులైన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో సొంత ఇంటిని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్​ గుర్తుచేశారు. నిజామాబాద్ నగరంలోని ఆర్‌జీకే కాలనీలో 480 ఫ్లాట్ల కేటాయింపునకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. ప్రతి ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్ విస్తీర్ణం 512 చదరపు అడుగులు కాగా, ఒక్కో ఫ్లాట్‌పై ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీ మినహాయించి లబ్ధిదారుడి వాటాగా తాత్కాలికంగా రూ.3.50 లక్షలు నిర్ణయించబడిందని, ఫ్లాట్ల నిర్మాణానికి అవసరమైన స్థలం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు.

Indiramma Towers | అర్హతలివే..

అర్హత కలిగిన దరఖాస్తుదారులను ముందుగా ఐడీ వెరిఫికేషన్ ద్వారా గుర్తించి, అనంతరం లాటరీ విధానంలో ఫ్లాట్ల కేటాయింపు చేపడతామని కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సొంత ఇల్లు లేదా ప్లాట్ లేని వారు, కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించని వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఒక కుటుంబం నుంచి ఒకే దరఖాస్తుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. డిసెంబర్ 5వ తేదీ లోపు మీ సేవా కేంద్రాల ద్వారా లేదా అధికారిక మీ సేవా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

ఇది కూడా చదవండి..: Pension Scheme | దేశంలోకెల్లా ఎక్కువ పింఛన్లు ఇస్తున్నది తెలంగాణలోనే..: ప్రభుత్వ సలహాదారు పోచారం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *