అక్షరటుడే, వెబ్‌డెస్క్: N Chandrasekaran Resignation |
టాటా సన్స్ చైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా చేసిన విషయం విదితమే. ఆయన నిష్క్రమణ నేపథ్యంలో టాటా సన్స్ (Tata Group) నూతన అధినేత ఎంపిక ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. కంపెనీ నియమావళిలోని ఆర్టికల్ 118 ప్రకారం అరెస్ట్ శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ సంయుక్తంగా ఐదుగురు సభ్యులతో ఒక ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తాయి. ఈ కమిటీలో టాటా ట్రస్ట్స్ నామినేట్ చేసిన ముగ్గురు, టాటా సన్స్ బోర్డు సభ్యుడు ఒకరు, మరొక స్వతంత్ర నిపుణుడు ఉంటారు. ఈ కమిటీ సూచించే అభ్యర్థికి టాటా సన్స్ బోర్డు అధికారికంగా ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
N Chandrasekaran Resignation | పొడిగింపుపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు..
చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించాలని గతంలో టాటా ట్రస్ట్స్ ఏకగ్రీవంగా సిఫార్సు చేసినప్పటికీ, ఫిబ్రవరిలో జరిగిన బోర్డు భేటీలో ఈ ప్రతిపాదన వివాదాస్పదమైంది. గ్రూప్‌లోని కొన్ని కంపెనీలు చవిచూసిన ఆర్థిక నష్టాలను ప్రస్తావిస్తూ టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా ఆయన పొడిగింపుపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. బోర్డులో ఏకాభిప్రాయం రాకపోవడం, సుమారు ఆరు నెలలు గడిచినా స్పష్టత కొరవడటంతో.. వాటాదారులు, పెట్టుబడిదారులకు నాయకత్వ అంశంపై స్పష్టతనివ్వడానికే తాను తప్పుకుంటున్నట్లు చంద్రశేఖరన్ స్పష్టం చేశారు.
N Chandrasekaran Resignation | కొత్త చైర్మన్ ఎంపిక ఎలా చేస్తారు?
చంద్రశేఖరన్ నిష్క్రమణ నేపథ్యంలో టాటా సన్స్ నూతన అధినేత ఎంపిక ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. కంపెనీ నియమావళిలోని ‘ఆర్టికల్ 118’ ప్రకారం, 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ సంయుక్తంగా ఐదుగురు సభ్యులతో ఒక ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తాయి. ఈ కమిటీలో టాటా ట్రస్ట్స్ నామినేట్ చేసిన ముగ్గురు, టాటా సన్స్ బోర్డు సభ్యుడు ఒకరు, మరొక స్వతంత్ర నిపుణుడు ఉంటారు. ఈ కమిటీ సూచించే అభ్యర్థికి టాటా సన్స్ బోర్డు అధికారికంగా ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
N Chandrasekaran Resignation | నోయెల్ టాటా చైర్మన్ పీఠాన్ని అధిష్టించే అవకాశం ఉందా?
ప్రస్తుతం టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నోయెల్ టాటా నేరుగా టాటా సన్స్ చైర్మన్ పీఠాన్ని అధిష్టించే అవకాశం లేదు. 2022లో సవరించిన టాటా సన్స్ నిబంధనల ప్రకారం.. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ లేదా సర్ రతన్ టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌గా ఉన్న వ్యక్తి ఒకే సమయంలో టాటా సన్స్ చైర్మన్‌గా కొనసాగడానికి వీలులేదు. యాజమాన్య నిర్వహణకు, కంపెనీ పాలనకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిబంధనను తీసుకువచ్చారు. దీంతో ఎంపిక కమిటీ సిఫార్సు చేసే నూతన అభ్యర్థికే టాటా గ్రూప్ బాధ్యతలు దక్కనున్నాయి.
టాటా గ్రూప్‌లో సంచలనం.. టాటా సన్స్ చైర్మన్ రాజీనామా
టాటా సన్స్ చైర్మన్ పదవికి ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన పదవీకాలం 2027 ఫిబ్రవరి వరకు ఉన్నప్పటికీ, జనరల్ బాడీ మీటింగ్‌కు ముందు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
నోయల్ టాటాతో విభేదాల… pic.twitter.com/etpbiFxeVB
— SkyC Media (@SkyCMedia) August 12, 2026
ఇది కూడా చదవండి..: Private Hospital Room Rent | గదుల అద్దె నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి.. పార్లమెంటరీ కమిటీ సిఫార్సు..