అక్షరటుడే, బోధన్: Bodhan Crime Control | బోధన్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. బుధవారం కోటగిరి పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు.
Bodhan Crime Control | చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా..
డివిజన్ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టాలని సీపీ సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులపై క్షుణ్ణంగా సమీక్ష చేశారు. సైబర్ నేరాలపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఆన్లైన్ మోసాలకు గురైన బాధితులకు సాయం చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా డివిజన్ పరిధిలో జరిగిన హత్య, హత్యాయత్నం, చోరీలు మహిళలపై నేరాలు, సైబర్ మోసాలపై నమోదైన కేసులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Bodhan Crime Control | నేరస్తుల కదలిక కదలికలపై..
డివిజన్ పరిధిలో నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సాయిచైతన్య తెలిపారు. రౌడీషీటర్లు పాత నేరస్తులు, బెయిల్‌పై విడుదలైన వారిపై పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు వాహనాల తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించాలని పేర్కొన్నారు. డయల్ 112 గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సీఐ విజయ్‌బాబు, ఎస్సైలు, ఐటీ కోర్సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Farmer ID Registration | ఫార్మర్ ఐడీ లేకుంటే.. పథకాలన్నీ బంద్..!