Red Cross Society Nizamabad | రెడ్​క్రాస్​ సొసైటీ ఎన్నికల్లో ఇందూరు సేవా సమితి ప్యానెల్​ విజయం

నిజామాబాద్​ రెడ్​క్రాస్​ సొసైటీ ఛైర్మన్​గా ఎన్నికయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Red Cross Society Nizamabad | నిజామాబాద్ (Nizamabad)​ రెడ్​క్రాస్​ సొసైటీ ఎన్నికల్లో ఇందూరు సేవా సమితి ప్యానెల్​ ఘన విజయం సాధించింది. విజేతల వివరాలను ​ ఆదివారం రాత్రి ఎన్నికల అధికారి శ్రీనివాస్ ఫలితాలు వెల్లడించారు. సోమవారం పూర్తి కార్యవర్గం ఎన్నిక కానుంది.

Red Cross Society Nizamabad | ఆద్యంతం ఉత్కంఠగా..

మొత్తం 29 మంది పోటీ పడగా.. 15 మంది విజేతలను ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంట్లో ఇందూరు సేవా సమితి ప్యానెల్​ సభ్యులు 11 మంది విజయం సాధించారు. బుస్స ఆంజనేయులు ప్యానెల్​లో నలుగురు అభ్యర్థులు ఎక్కువ ఓట్లు పొందారు.

మొత్తంగా  సీనునాయక్​కు 794 ఓట్లు, ఆంజనేయులుకు 793, దీకొండ యాదగిరి 785, మల్లెపూల జగన్​ గౌడ్​ 783, రంజిత్​గౌడ్​ 759, పోతన్​కర్​ లక్ష్మీనారాయణ 755, చౌహాన్​ బాలాజీ 749, కరిపె రవీందర్​ 749, ఏ రవీందర్​ 746, యెండల సుధాకర్​ 743, కొండ సత్యప్రసాద్​ 742, నరాల సుధాకర్ 734, జెస్సు అనిల్​కుమార్​ 730, కెంపుల నాగరాజు 728, పద్మ సుభాష్​కు 728 ఓట్లు వచ్చాయి.

Red Cross Society Nizamabad | పోలైన ఓట్లు ఎంతంటే..

ఈ ఏడాది రెడ్​క్రాస్​ ఎన్నికలు జిల్లావ్యాప్తంగా హాట్​టాపిక్​గా మారాయి. సొసైటీకి జరిగిన ఎన్నికల్లో 29 మంది అభ్యర్థులు రెండు ప్యానెళ్లుగా విడిపోయి పోటీ చేశారు. ఎవరికివారు పోటాపోటీగా ప్రచారం చేశారు. ఎప్పుడు కూడా రెడ్​క్రాస్​ కార్యవర్గం ఏకగ్రీవమయ్యేది.

రెడ్​క్రాస్​ సొసైటీలో మొత్తంగా 9,823 మందికి ఓటింగ్​ అవకాశం ఉండగా.. మధ్యాహ్నం పోలింగ్​ సమయం ముగిసేనాటికి 1552 ఓట్లు పోలయ్యాయి. డీసీసీ శ్రీనివాస్​ వివరాలు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: దసరా బరిలో 6 సినిమాలు.. విన్నర్ ఎవరో? 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *