అక్షరటుడే, వెబ్‌డెస్క్: Security Guard Arrest | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఓ సెక్యూరిటీ గార్డు రెచ్చిపోయాడు. అందరు చూస్తుండగానే ఓ మహిళకు నడిరోడ్డుపై ముద్దు పెట్టాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
గచ్చిబౌలిలోని ఇందిరానగర్‌లో క్యాబ్ ఎక్కుతున్న మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (24)కు సెక్యూరిటీ గార్డు ముద్దు పెట్టాడు. ఆమెను పక్కకు లాగి అందరు చూస్తుండగానే దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. సెక్యూరిటీ గార్డు చేసిన పనికి ఓ యువతి షాక్ అయింది. అనంతరం గట్టిగా కేకలు వేయడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు.
Security Guard Arrest | నిందితుడి అరెస్ట్
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని జార్ఖండ్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు రాజ్‌కుమార్ (25)గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. బాధిత యువతి వైజాగ్ నుంచి వచ్చి హాస్టల్లో ఉంటూ ఐటీ జాబ్ చేస్తోంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Student Drug Arrest | డ్రగ్స్ విక్రయిస్తున్న విద్యార్థుల అరెస్ట్