అక్షరటుడే వెబ్‌డెస్క్: Trump AI Rename | ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) అనే పదానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త పేరు పెట్టారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన సందర్భంగా ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఇకపై అమెరికా ప్రభుత్వ అధికారిక పత్రాల్లో ఏఐకి బదులుగా ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI) అనే పదాన్ని ఉపయోగించనున్నట్లు స్పష్టం చేశారు.
Trump AI Rename | ‘ఆర్టిఫిషియల్’ నకిలీ కాదు..
‘ఆర్టిఫిషియల్’ అనే పదం వింటే ఏదో కృత్రిమమైన లేదా నకిలీ విషయంలా అనిపిస్తోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. కానీ ఏఐ అనేది ఒక అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానమని, దీనిని మరింత జాగ్రత్తగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘ఆర్టిఫిషియల్’ కంటే ‘సూపర్’ అనే పదం ఈ టెక్నాలజీకి మరింత సరైనదని ఆయన తెలిపారు. ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఇదే పదాన్ని అనుసరిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే, భవిష్యత్తులో మానవ సామర్థ్యాలను పూర్తిగా అధిగమించే అత్యాధునిక వ్యవస్థలను సూచించడానికి టెక్నాలజీ రంగంలో ఇప్పటికే ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అనే పదాన్ని వాడుతుండటం గమనార్హం.
Trump AI Rename | ట్రంప్ వ్యతిరేకత..
ఈ సందర్భంగా ఏఐ నియంత్రణపై తన వైఖరిని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను నియంత్రించేందుకు రూపొందించే ఏ అంతర్జాతీయ వ్యవస్థలను అమెరికా అంగీకరించబోదని తేల్చిచెప్పారు. పారిశ్రామిక విప్లవం కంటే కూడా ఈ సాంకేతికత ఎంతో పెద్దదిగా మారే అవకాశం ఉందని, దీని అభివృద్ధిని అడ్డుకోవడం తన ఉద్దేశం కాదని వెల్లడించారు. ఏఐ వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయనే హెచ్చరికలను కొట్టిపారేసినప్పటికీ.. టెక్నాలజీని నిశితంగా పరిశీలిస్తామని, అవసరమైతే అమెరికా న్యాయ శాఖ జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు.
Trump AI Rename | సోషల్ మీడియా వేదికగా ..
ఏఐ పేరు మార్చాలనే ఆలోచన ట్రంప్‌కు ఒక్కసారిగా రాలేదు. దీనికి ప్రత్యామ్నాయ పేర్లపై ఆయన ఇటీవలే సోషల్ మీడియా ద్వారా తన అనుచరుల అభిప్రాయాలను కోరారు. ఆ సమయంలో ‘సూపర్ ఇంటెలిజెన్స్’, ‘ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్’ వంటి పేర్లు పరిశీలనకు వచ్చాయి. చివరకు ఐక్యరాజ్యసమితి వేదికగా ‘సూపర్ ఇంటెలిజెన్స్’ పేరును ఆయన అధికారికంగా ప్రకటించారు. అమెరికా ప్రభుత్వ పత్రాల్లో ఈ మార్పు ఎంతవరకు అమలవుతుంది, అంతర్జాతీయంగా మిగతా దేశాలు దీనిని ఏ విధంగా స్వీకరిస్తాయనేది ఇప్పుడు టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
🇺🇸 Trump just decided AI needs a rebrand in the middle of his UN speech.
The president wants “artificial intelligence” renamed “superintelligence,” or SI, saying the new term sounds much better.
“𝘓𝘦𝘵’𝘴 𝘴𝘦𝘦 𝘪𝘧 𝘵𝘩𝘢𝘵 𝘨𝘰𝘦𝘴.”
Somewhere, ChatGPT is updating its…
— Mario Nawfal (@MarioNawfal) September 22, 2026
ఇది కూడా చదవండి: Security Guard Arrest | క్యాబ్ ఎక్కుతుండగా.. సాఫ్ట్వేర్ ఉద్యోగినికి ముద్దు పెట్టిన సెక్యూరిటీ గార్డు