అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Summer Power Demand | వేసవి విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు నిజామాబాద్(Nizamabad) ట్రాన్స్‌కో ఎస్ఈ పీవీ రాజేశ్వర్‌రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
Summer Power Demand | ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో..
ఎల్‌నినో ప్రభావంతో వేసవిలో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తుగా డీటీఆర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, నూతన సబ్ స్టేషన్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలన్నారు. విద్యుత్ పంపిణీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నట్లు రాజేశ్వర్‌రావు తెలిపారు. రానున్న వేసవిలో ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. అధిక లోడ్ ఉన్న ప్రాంతాలను గుర్తించి ఇప్పటివరకు కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 117 ట్రాన్స్ఫార్మర్ల సామర్ధ్యం పెంపు కార్యక్రమం చేపట్టామన్నారు.
అలాగే ఒక కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్, మూడు పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు, 2 కొత్త సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే అవసరమైన ప్రాంతాల్లో కొత్త సబ్జెస్టేషన్ల నిర్మాణం, 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్ల సామర్థ్యం పెంపు వంటి పనులను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. వినియోగదారులకు ఎలాంటి విద్యుత్ సరఫరా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ అన్ని అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని ఎస్ఈ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ధోని రిటైర్మెంట్..ఫ్యాన్ ఎలా ఫీల్ అయ్యాడో చూడండి