TG iPASS Website Hacking | టీజీఐపాస్‌ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌ కలకలం.. టర్కీ కేంద్రంగా సైబర్ దాడి చేసినట్లు గుర్తించిన టీజీసీఎస్‌బీ!

హ్యాకర్ల చేతిలో ఎన్‌క్రిప్ట్ అయిన కీలక డేటాను అత్యంత చాకచక్యంగా రికవరీ చేసిన నిపుణులు, వెబ్‌సైట్‌ భద్రతా లోపాలను సరిదిద్ది తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: TG iPASS Website Hacking | తెలంగాణ Telangana ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పారిశ్రామిక అనుమతుల పోర్టల్ టీజీఐపాస్‌ (TG-iPASS) వెబ్‌సైట్‌పై జరిగిన సైబర్ దాడి కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ హ్యాకింగ్ వ్యవహారం టర్కీ (Turkey) కేంద్రంగా జరిగినట్లు సైబర్ నిపుణులు ప్రాథమికంగా గుర్తించారు.

TG iPASS Website Hacking | అసలేం జరిగిందంటే..

గత అక్టోబర్‌ 22వ తేదీ రాత్రి 11.36 గంటల సమయంలో గుర్తుతెలియని సైబర్ నేరగాళ్లు టీజీఐపాస్‌ వెబ్‌సైట్‌లోకి చొరబడ్డారు. అత్యంత కీలకమైన వెబ్‌సైట్‌ డేటాబేస్‌ను హ్యాకర్లు పూర్తిగా ఎన్‌క్రిప్ట్‌ (Encrypt) చేయడంతో పోర్టల్‌ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియకు అంతరాయం కలగడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

TG iPASS Website Hacking | రంగంలోకి నిపుణుల బృందం..

సైబర్ దాడి సమాచారం అందుకున్న వెంటనే టీజీసీఎస్‌బీ అధికారులు, సాంకేతిక నిపుణుల బృందం రంగంలోకి దిగింది. హ్యాకర్ల చేతిలో ఎన్‌క్రిప్ట్ అయిన కీలక డేటాను అత్యంత చాకచక్యంగా రికవరీ చేసిన నిపుణులు, వెబ్‌సైట్‌ భద్రతా లోపాలను సరిదిద్ది తిరిగి అందుబాటులోకి (రీ-ఓపెన్) తీసుకువచ్చారు. ప్రస్తుతం పోర్టల్‌ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

TG iPASS Website Hacking | టర్కీ ఐపీ అడ్రస్‌ల గుర్తింపు

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న టీజీసీఎస్‌బీ లోతైన దర్యాప్తు చేపట్టింది. సాంకేతిక ఆధారాలు, సర్వర్ లాగ్స్ పరిశీలించగా.. ఈ సైబర్ దాడి టర్కీ నుంచి జరిగినట్లు తేలింది. విదేశీ హ్యాకర్ల ముఠా ఈ పని చేసిందా, లేక వీపీఎన్ (VPN) లేదా ప్రాక్సీ సర్వర్ల సాయంతో టర్కీ లొకేషన్ చూపించారా అనే కోణంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో విచారణ జరుపుతోంది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వ వెబ్‌సైట్లకు మరింత పటిష్టమైన సైబర్ భద్రతా కవచాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *