Tirumala Gold Donation | శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలు విరాళం

తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం సమర్పించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tirumala Gold Donation | తిరుమల (Tirumala)లో కొలువైన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు భారీ విరాళం సమర్పించారు. 121కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి సమర్పించారు.

చెన్నైకి చెందిన వ్యాపారి వర్దమాన్ జైన్ 121 కిలోల బంగారు ఆభరణాలను గురువారం ఈవోకు అందజేశారు. పాదాల నుంచి శిరస్సు వరకు అలంకరించే 46 రకాల ఆభరణాలు ఇందులో ఉన్నాయి. ఆ వ్యాపారి గతంలో సైతం స్వామి వారికి విరాళాలు ఇచ్చి భక్తి చాటుకున్నారు. 2025 జనవరిలో రూ.6 కోట్లు, ఈ ఏడాది మేలో ఎలక్ట్రిక్ బస్సును అందించారు.

Tirumala Gold Donation | రూ.150 కోట్లు

తాజాగా వ్యాపారి జైన్​ సమర్పించిన బంగారు ఆభరణాల విలువ రూ.150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కిరీటం, పద్మపాదాలతో పాటు పలు రకాల ఆభరణాలను స్వామి వారికి సమర్పించారు.

ఇది కూడా చదవండి..: Anantapur Road Accident | వివాహానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. నలుగురు మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *