అక్షరటుడే, వెబ్డెస్క్: Anantapur Road Accident | అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ (Hyderabad)లో వివాహానికి వెళ్లి వస్తుండగా.. యాడికి మండలం రాయలచెరువు సమీపంలో తుఫాన్, లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
కావేటి సముద్రం, తాడిపత్రి గ్రామాలకు చెందిన పలువురు తుఫాన్ వాహనంలో వివాహానికి వెళ్లారు. బుధవారం రాత్రి తిరుగు పయనం అయ్యారు. తెల్లవారుజామున వీరి వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొంది. ప్రమాదంలో కావేటి సముద్రం గ్రామానికి చెందిన వీరాంజనేయులు రెడ్డి, హనుమంత్ రెడ్డి అలియాస్ చిన్నబాబుతో పాటు తాడిపత్రికి చెందిన మల్లికార్జున, ఆయన భార్య మృతి చెందారు. పలువురురికి గాయాలు అయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Anantapur Road Accident | చిల్లకూరు వద్ద తప్పిన ఘోర ప్రమాదం
విజయవాడ నుంచి 34 మందితో బెంగళూరు వెళ్తున్న బస్సులో చిల్లకూరు మండలంలోని వరగలి క్రాస్ రోడ్డు వద్ద మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సు ఆపడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి..: Andhra Pradesh Cyclone Alert | ఏపీకి పొంచి ఉన్న మరో రెండు తుఫాన్ల ముప్పు?