Valmiki Corporation Scam | వాల్మీకి కార్పొరేషన్​ నిధుల స్వాహా.. బీజేపీ ఎమ్మెల్యేల నిరసన

వాల్మీకి కార్పొరేషన్​ నిధులు దుర్వినియోగం చేశారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Valmiki Corporation Scam | మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్ నిధుల దుర్వినియోగం కుంభకోణంలో కర్ణాటక మంత్రి బి. నాగేంద్ర రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు గురువారం బెంగళూరులోని వాల్మీకి విగ్రహం నుండి విధాన సౌధ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.

రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత ఆర్. అశోక్ మాట్లాడుతూ.. డీకే శివకుమార్ (DK Shivakumar), ఆయన సహచరుడు నాగేంద్ర కలిసి దళితులకు చెందిన రూ. 189 కోట్లను దోచుకున్నారని ఆరోపించారు. దళితుల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన డబ్బును దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 3-4 ఏళ్లుగా దళితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. వెంటనే మంత్రి నాగేంద్ర రాజీనామా చేయాలన్నారు. అప్పటి వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Valmiki Corporation Scam | అవినీతి ఆరోపణలు ఉన్నా..

బీజేపీ ఎమ్మెల్యే మహేష్ తెంగినకాయి మాట్లాడుతూ.. మంత్రి నాగేంద్రకు వ్యతిరేకంగా 4 రోజులుగా ఆందోళన చేస్తున్నామన్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ, కొనసాగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సిద్ధరామయ్య ఆయనను ఎందుకు తొలగించారు? ఇప్పుడు డీకే శివకుమార్‌ను ఎందుకు తీసుకున్నారని నిలదీశారు. ఇప్పుడు తొలగిస్తే, అనేక పేర్లు ఈ కేసులో బయట పడుతాయన్నారు.

ఇది కూడా చదవండి..: Bihar Creator Scheme | వీడియోలు చేస్తే రూ.లక్ష క్యాష్‌ప్రైజ్‌.. ఇన్‌ఫ్లూయెన్సర్లకు సర్కార్‌ బంపరాఫర్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *