Srisailam Reservoir Flood | శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్​లోకి 82 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Srisailam Reservoir Flood | శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎగువన వర్షాలు పడుతుండటంతో ప్రాజెక్ట్​లోకి మోస్తరు ఇన్​ఫ్లో వస్తోంది.

ఇటీవల వరద లేకపోవడం, విద్యుత్​ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతుండటంతో జలాశయం నీటి మట్టం తగ్గింది. 180 టీఎంసీలు దాటిన నీటినిల్వ 167 టీఎంసీలకు పడిపోయింది. అయితే తాజాగా వరద మొదలు అవడటంతో జాలశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

Srisailam Reservoir Flood | 82 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో

శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir)లోకి ప్రస్తుతం 82,368 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. కుడి గట్టు జల విద్యుత్​ కేంద్రం ద్వారా ఉత్పత్తిని నిలిపివేశారు. ఎడమ గట్టు కేంద్రం ద్వారా మాత్రం ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్​ ఉత్పత్తి ద్వారా దిగువకు 35,315 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 167 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి వస్తున్న నీటితో పాటు స్థానికంగా కురిసిన వర్షాలతో నల్గొండలోని నాగర్జున సాగర్కు 56 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 169 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఇది కూడా చదవండి..: Konda Sushmitha | నా టార్గెట్ రేవంత్ రెడ్డి.. కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *