Ivanka Trump Assassination | ఇవాంకా ట్రంప్ హత్య కుట్ర కలకలం.. అనుమానితుడి అరెస్టుతో బయటపడ్డ కీలక వివరాలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ivanka Trump Assassination | అమెరికాలో భద్రతా వర్గాలను కలవరపరిచే పరిణామం తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ (Islamic Revolutionary Guard Corps)తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అనుమానితుడు, ఇవాంకా ట్రంప్‌ (Ivanka Trump)ను లక్ష్యంగా చేసుకుని దాడి ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.

నివేదికల ప్రకారం, ఈ కేసులో అరెస్టైన వ్యక్తి ఇరాకీ జాతీయుడైన మహమ్మద్ బాకర్ సాద్ దావూద్ అల్-సాదీగా గుర్తించారు. అతనికి IRGC, అలాగే ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ నెట్‌వర్క్‌లతో సంబంధాలు ఉన్నాయని అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి.

Ivanka Trump Assassination | అన్ని కోణాల‌లో విచార‌ణ‌..

ఈ కుట్ర వెనుక ప్రధాన కారణంగా 2020లో జరిగిన అమెరికా డ్రోన్ దాడిని ప్రస్తావిస్తున్నారు. ఆ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ కాసిం సోలిమ‌ణి మరణించారు. ఆ ఘటనకు ప్రతీకార చర్యగా ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కుట్ర పన్నినట్లు సమాచారం. కొన్ని నివేదికల ప్రకారం, అనుమానితుడు ఇవాంకా ట్రంప్ నివాసానికి సంబంధించిన వివరాలను సేకరించినట్లు కూడా దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది. అతడిని టర్కీలో అరెస్టు చేసి తర్వాత అమెరికాకు తరలించినట్లు సమాచారం.అయితే ఇప్పటివరకు అమెరికా అధికార వర్గాల నుంచి ఈ అంశంపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన వెలువడినట్లు స్పష్టత లేదు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని, భద్రతా సంస్థలు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామం అమెరికా–ఇరాన్ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మరింత చర్చకు దారితీస్తోంది. భౌగోళిక రాజకీయ పరిణామాలపై కూడా దీని ప్రభావం ఉండే అవకాశాలపై విశ్లేషకులు దృష్టి సారిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: US Green Card Rules | గ్రీన్‌కార్డు కావాలా?.. అయితే స్వదేశానికి వెళ్లండి! తాత్కాలిక వలసదారులకు యూఎస్‌సీఐఎస్ స్పష్టీకరణ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *