Bajaj Pulsar N160 | బజాజ్ పల్సర్ కొత్త వేరియంట్ లాంచ్ ..

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bajaj Pulsar N160 | భారతదేశ టూ వీలర్ మార్కెట్‌లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యే పల్సర్ బైకుల్లో (Pulsar Bike) బజాజ్ ఆటో సంస్థ ఒక సరికొత్త వేరియంట్ ను తీసుకువచ్చింది. పాపులర్ మోడల్ పల్సర్ ఎన్ 160 రేంజ్‌లో ప్రీమియం వేరియంట్‌ను పరిచయం చేసింది.

ఈ కొత్త ట్రిమ్‌లో రైడర్లకు మెరుగైన బ్యాలెన్స్, కంట్రోల్ అందించడానికి సరికొత్త టెక్నాలజీ ఫీచర్లను యాడ్ చేశారు. భారీ రేసింగ్ బైకులకు మాత్రమే పరిమితమైన క్రేజీ ఫీచర్లు ఇందులో ఉండడం విశేషం. ఇది టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160, యమహా ఎఫ్‌జెడ్, హీరో ఎక్స్‌ట్రీమ్ 160 4వీ లతో గట్టిగా పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ బైక్ ఫీచర్లు తెలుసుకుందామా..

Bajaj Pulsar N160 | ఇంజిన్ సామర్థ్యం..

బైక్ ఇంజన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. పాత వేరియంట్‌లోలాగే 164.82 సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజన్‌నే వాడారు. ఇది 15.7 బీహెచ్పీ పవర్, 14.65 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జతచేశారు.

Bajaj Pulsar N160 | ప్రీమియం లుక్ ..

స్టాండర్డ్ సిరీస్ కంటే కూడా ప్రీమియం లుక్, మెరుగైన ఫీచర్స్‌ను కలిగి ఉంది. ఇందులో అతిపెద్ద అప్‌డేట్ ఏమిటంటే దీనికి అమర్చిన గోల్డెన్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్. ఈ గోల్డెన్ కలర్ సస్పెన్షన్ బైక్‌కు రేసింగ్ లుక్‌ను ఇస్తుంది. రోడ్లపై సడన్ టర్నింగ్స్ తీసుకునేటప్పుడు, స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు బైక్ షేక్ కాకుండా స్టెబిలిటీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. టాప్ ఎండ్ వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు విభిన్న రోడ్ల కోసం ప్రత్యేకమైన రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. రాత్రి వేళల్లో రోడ్లు క్లియర్‌గా కనిపించేందుకు ఎలఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, సింగిల్ పీస్ సీట్ సెటప్ ఉంది.

Bajaj Pulsar N160 | సేఫ్టీ ఫీచర్లు..

బైక్ నడిపేటప్పుడు సేఫ్టీ కోసం ఈ వేరియంట్‌లో పవర్‌ఫుల్ ఫీచర్లను జోడించింది. ఇందులో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీని వాడారు. దీనివల్ల ట్రాఫిక్‌లో గేర్లు డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు వెనక చక్రం లాక్ అవకుండా చాలా స్మూత్ రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. అలాగే ముందు, వెనక చక్రాలకు డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్ చానల్ ఏబీఎస్ భద్రతను కూడా కల్పించారు.

కవర్ ఆప్షన్స్ : పాత కలర్ ఆప్షన్లయిన పర్ల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, గ్రే, బ్రూక్లిన్ బ్లాక్ రంగులలో లభిస్తుంది.

ధర : ఢిల్లీలో దీని ప్రారంభ (ఎక్స్ షోరూమ్) ధరను రూ. 1.22 లక్షలు. దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత బజాజ్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి..: Oppo Find X9S | అధునాతన ప్రాసెసర్‌తో మరో ఫోన్.. ఫైండ్ ఎక్స్ 9 ఎస్ లాంచ్ చేసిన ఒప్పో

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *