Chandrababu Comments | జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు..

shashi kiran Mottala
Chandrababu Comments

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chandrababu Comments | చిత్తూరు జిల్లా (Chittoor District) యాదమర్రి ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన ప్రసంగంలో రాజకీయ విమర్శలతో పాటు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాయలసీమ భవిష్యత్‌పై పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ (Y.S. Jagan) నోరు తెరిస్తే అబద్ధాలే వస్తున్నాయని విమర్శించారు. గతంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. ఆ సమయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించారని ఆరోపించారు.

Chandrababu Comments | అస‌త్య ప్ర‌చారాలు…

రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రతిపక్షం ఓర్వలేకపోతోందని చంద్రబాబు (Chandrababu) వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అమరావతి అంశంపై జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని, రాజధాని అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజకీయ ప్రయోజనాలు పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం కంటే అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్య, వైద్య  రంగాల్లో ప్రజలపై ఖర్చు భారం పెరుగుతోందని పేర్కొన్న ఆయన, ఎన్టీఆర్ ఆరోగ్య పథకం కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

Chandrababu Comments | రాయలసీమ అభివృద్ధిపై..

రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేకంగా స్పందించిన సీఎం, ఆ ప్రాంతాన్ని పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పుట్టపర్తిలో జెట్ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో పెట్టుబడులు పెరుగుతున్నాయని తెలిపారు. అలాగే రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని, భవిష్యత్తులో కర్నూలు ప్రాంతం దేశంలోనే బంగారం ఉత్పత్తిలో కీలక స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్ట్ ద్వారా సాగునీటి సదుపాయాలను విస్తరించామని వెల్లడించారు. రాజకీయ ఆరోపణలతో పాటు అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఇది కూడా చదవండి..: Nara Lokesh Support | అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి మంత్రి లోకేశ్ అండ.. రూ.23 లక్షల వైద్య ఖర్చు భరిస్తానని హామీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *