Tractor Accident Makloor | ట్రాక్టర్ బోల్తా పడి యువకుడి మృతి

shashi kiran Mottala

అక్షరటుడే, మాక్లూర్: Tractor Accident Makloor | మండలంలోని కొత్తపల్లి గ్రామంలో (kothapally village) విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందాడు.

Tractor Accident Makloor | ఉపాధి మట్టి నింపేందుకు వెళ్లగా..

గ్రామానికి చెందిన నవీన్​ అనే వ్యక్తి శ్రీధర్​కు (30) ట్రాక్టర్​ ఇచ్చి ఉపాధి హామీ మట్టిని తీసుకొచ్చేందుకు పంపాడు. ఈ క్రమంలో ట్రాక్టర్​తో స్థానిక చెరువు వద్దకు శ్రీధర్ వెళ్లాడు. చెరువు కట్ట దిగుతుండగా ట్రాక్టర్​ పల్టీ కొట్టింది. దీంతో ట్రాక్టర్​ కింద పడ్డ శ్రీధర్​ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. మృతుడు తండ్రి పోశెట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ (makloor Police) తెలిపారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *