అంతర్జాతీయంPakistan Train Blast | పాకిస్తాన్‌లో భారీ ఉగ్రదాడి.. 24 మంది మృతి

Pakistan Train Blast | పాకిస్తాన్‌లో భారీ ఉగ్రదాడి.. 24 మంది మృతి

పాకిస్తాన్​లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో రైలుపై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి చేశారు. ఈ ఘటనలో 24 మంది మృతి చెందారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan Train Blast | పాకిస్తాన్​లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో రైలుపై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి చేశారు. ఈ ఘటనలో 24 మంది మృతి చెందగా.. 47 మందికి తీవ్ర గాయాలు అయ్యయి.

నైరుతి పాకిస్తాన్​లోని బలూచిస్తాన్ రాష్ట్ర రాజధాని క్వెట్టాలో, సైనికులను తీసుకువెళ్తున్న రైలుపై జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో కనీసం 24 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమని వేర్పాటువాద బృందమైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. ఈ ఘటనలో రైలు మార్గానికి ఆనుకుని ఉన్న అనేక ఇళ్లు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పేలుడు ధాటికి కొన్ని రైలు బోగీలు బోల్తా పడి మంటలు చెలరేగాయి.

Pakistan Train Blast | ఖండించిన ప్రధాని

బలూచిస్తాన్‌లో బీజింగ్ చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వ్యతిరేకత కారణంగా ఈ దాడుల తీవ్రత పెరిగిందని, చైనా కార్మికులను కూడా లక్ష్యంగా చేసుకున్నారని అధికారులు తెలిపారు. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ కింద, చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతం పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టుకు అనుసంధానించబడింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ దాడిని ఖండిస్తూ ఒక పోస్ట్ చేశారు. ఇలాంటి పిరికిపంద ఉగ్రవాద చర్యలు పాకిస్తాన్ ప్రజల సంకల్పాన్ని బలహీనపరచలేవన్నారు.

Pakistan Train Blast | సహాయక చర్యలు

సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సివిల్ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి రైలు బయలుదేరిన కొద్దిసేపటికే దాడి జరిగింది. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.

దీనిని కూడా చదవండి : Iran Peace Agreement | కొద్ది గంటల్లో గుడ్​న్యూస్​.. యూఎస్​ విదేశాంగ కార్యదర్శి కీలక ప్రకటన

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

PCC Chief Birthday | కాంగ్రెస్​ భవన్​లో ఘనంగా పీసీసీ చీఫ్​ జన్మదిన వేడుకలు..

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PCC Chief Birthday | నగరంలోని కాంగ్రెస్​...

TPCC Chief Birthday | బోర్గాం( పి)గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పీసీసీ చీఫ్​ జన్మదిన వేడుకలు

అక్షరటుడే, ఇందూరు: TPCC Chief Birthday | నగరంలోని (Nizamabad) బోర్గాం...

BJP Chief Letter | సీఎం రేవంత్‌కు బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు లేఖ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP Chief Letter | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి...

Iran Peace Agreement | కొద్ది గంటల్లో గుడ్​న్యూస్​.. యూఎస్​ విదేశాంగ కార్యదర్శి కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Peace Agreement | నాలుగు రోజుల...