అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pharma Reactor Explosion | సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గడ్డపోతారం పారిశ్రామికవాడలోని ఎరిత్రో ఫార్మా (Erythro Pharma)లో రియాక్టర్ పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
ఎరిత్రో ఫార్మా పరిశ్రమలో సోమవారం ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమ చుట్టు పక్కల దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేశారు. ఈ ఘటనతో పరిశ్రమలోని కార్మికులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే ఈ ప్రమాదంలో ఎవరైన గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Pharma Reactor Explosion | రాజస్థాన్‌లో..

రాజస్థాన్ (Rajasthan)లోని బలోత్రా రిఫైనరీలో పేలుడు సంభవించింది. . రిఫైనరీలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో 20 ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. దీనిని మంగళవారం ప్రధాని మోదీ (PM Modi) ప్రారంభించడానికి సిద్ధం చేశారు. ఈ క్రమంలో ప్రమాదం జరగడం గమనార్హం.
Pharma Reactor Explosion | కార్మికుల ఆందోళన
తెలంగాణలోని పారిశ్రామికవాడల్లో ఇటీవల అగ్ని ప్రమాదాలు, రియాక్టర్ బ్లాస్ట్ ఘటనలతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు సైతం భయపడుతున్నారు. పరిశ్రమల యాజమాన్యం నిబంధనలు పాటించకపోవడంతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలి 50 మందికి పైగా చనిపోయారు. అనంతరం అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయినా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు.
దీనిని కూడా చదవండి : Netflix Subscription Price | సబ్స్క్రిప్షన్ రేట్లతో షాక్ ఇస్తున్న నెట్‌ఫ్లిక్స్.. భారత్‌లోనూ పెంచే అవకాశాలు?

