Electric Shock | ఖానాపూర్​లో విషాదం.. విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం

Shashi kiran Mottala
Electric Shock | విద్యుదాఘాతంతో రైతు మృతి..

అక్షరటుడే, ఆర్మూర్: Electric Shock | పొలం వద్ద విద్యుత్​ తీగలు తగిలి (electrocution accident) ఓ రైతు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ మండలం(Armoor) ఖానాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

Electric Shock | తన వ్యవసాయ క్షేత్రంలో..

ఆర్మూర్ ఎస్​హెచ్​వో(Armoor Police) సత్యనారాయణ గౌడ్ కథనం ప్రకారం.. శివరాం (58) తన వ్యవసాయ క్షేత్రంలో ఎర్రజొన్న సొప్పకు నిప్పంటించారు. అయితే ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న బోరు, పానెల్ బోర్డు వరకు మంటలు వ్యాపించాయి.

దీంతో శివరాం పానెల్ బోర్డు నుంచి కరెంటు వైర్లు తీసేందుకు ప్రయత్నించగా.. విద్యుత్​ షాక్​ తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​హెచ్​వో తెలిపారు.

ఇది కూడా చదవండి :Pharma Reactor Explosion | గడ్డపోతారం పారిశ్రామికవాడలో పేలుడు..

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *