నిజామాబాద్Kamareddy Venture Controversy | ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఆరెకరాల వెంచర్​కు అనుమతి: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ

Kamareddy Venture Controversy | ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఆరెకరాల వెంచర్​కు అనుమతి: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ

ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే కామారెడ్డి పట్టణంలో ఆరు ఎకరాల వెంచర్​కు కమిషనర్ అనుమతులు ఇచ్చారని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు.

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Venture Controversy | ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే (Kamareddy) కామారెడ్డి పట్టణంలో ఆరు ఎకరాల వెంచర్​కు కమిషనర్ అనుమతులు ఇచ్చారని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kamareddy Venture Controversy | వెంచర్​కు ఆగమేఘాల మీద అనుమతులెందుకు..?

ఈ సందర్భంగా పలు అంశాలపై టీపీసీసీ జనరల్ సెక్రెటరీ (TPCC General Secretary) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశం నిధులు తీసుకువచ్చి వాటిపై సమీక్ష చేసి ఉంటే బాగుండేదన్నారు. గతంలో ఆరుగురు కౌన్సిలర్లు ఉంటే చివరి వరకు కూడా రూ.లక్ష రూపాయల పని కూడా జరగలేదని, ఇప్పుడున్న 16 మంది కౌన్సిలర్లకు కూడా పైసా పని ఇవ్వలేదన్నారు. కామారెడ్డికి కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ ఛార్జ్​ తీసుకోగానే ఆరు ఎకరాల వెంచర్​కు ఫీజ్ ఇంటిమేషన్ ఇచ్చి అనుమతులు జారీ చేశారన్నారు. అయితే ఈ వెంచర్ ఎవరిది.. అంత తొందరగా అనుమతులు ఎందుకు ఇచ్చారని విచారణ చేస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.

Kamareddy Venture Controversy

Kamareddy Venture Controversy | నిజామాబాద్​కు చెందిన వారి వెంచర్​..

సదరు వెంచర్ నిజామాబాద్ (Nizamabad)కు చెందిన సుభిషి డెవలపర్స్​కు చెందినదిగా తెలిపారు. సదరు డెవలపర్స్ వెంచర్​కు అనుమతి ఇవ్వాలని కమిషనర్​కు ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పగానే ఇచ్చేశారన్నారు. ఇటీవల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు కేవీఆర్​ ఫౌండేషన్, సుభిషి డెవలపర్స్​ ఆధ్వర్యంలో బెంచీలు వితరణ చేయడం జరిగిందన్నారు. బెంచీల వితరణకు సుభిషి డెవలపర్స్ ఆర్థిక సహాయం చేసిందని, దానికి కృతజ్ఞతగానే వెంచర్​కు ఎమ్మెల్యే అనుమతి ఇప్పించారన్నారు.

అయితే వెంచర్ అనుమతిపై కమిషనర్ మాటలు పడ్డారని, దీనిపై దృష్టి మరల్చేందుకే మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష చేశారని ఆరోపించారు. పాత టీపీవోతో సదరు వెంచర్ ఫైల్ మొత్తం తయారు చేయించింది ఎమ్మెల్యేనని ఆరోపించారు. మరో మూడు వెంచర్లు అప్రూవల్​కు వచ్చాయని, వాటి ద్వారా వచ్చే అవినీతి డబ్బు ఇతర వారికి మళ్లిస్తున్నారని ఆరోపణలు చేశారు. గతేడాది కామారెడ్డి పట్టణాన్ని వరదలు అతలాకుతలం చేశాయని, జీఆర్ కాలనీ మునిగిపోతే ఎమ్మెల్యే తానే దగ్గరుండి డివైడర్లు కూల్చేయించానని చెప్పారని గుర్తు చేశారు. కానీ డివైడర్లు కూల్చేసి ఏడాది అవుతున్నా దానిని నిర్మించే స్థితిలో ఎమ్మెల్యే లేరని, అభివృద్ధిపై ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఎంతమేర ఉందో దీనిని బట్టి అర్థం అవుతోందన్నారు.

Kamareddy Venture Controversy | శ్మశాన వాటికల అభివృద్ధికి అడ్డుపడుతున్న మూడు నక్కలు

పట్టణంలోని హిందూ శ్మశాన వాటికల అభివృద్ధి కోసం హైదరాబాద్​కు చెందిన ఎస్​ఆర్ ఫౌండేషన్ (SR Foundation) ముందుకు వచ్చిందని గడ్డం చంద్రశేఖర్​రెడ్డి తెలిపారు. అయితే వాటిని అభివృద్ధి చేయడానికి ఎన్​వోసీ ఇవ్వాలని ఫౌండేషన్ ప్రతినిధులు కలెక్టర్​ను కలిసి వినతిపత్రం అందజేస్తే ఎంక్వెయిరీ కోసం ఎమ్మెల్యేగాని.. అధికారులు గాని శ్మశానవాటికలను విజిట్​ చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో హిందువుల ఓట్లను ఉపయోగించుకుని రాజకీయ పబ్బం గడిపారని, హిందూ శ్మశాన వాటికల అభివృద్ధికి వాళ్లే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ముసలి నక్క, కుంటి నక్క, గుడ్డి నక్కలు శ్మశాన వాటిక అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని విమర్శించారు.

Kamareddy Venture Controversy | నక్కల పేరుతో సంచలన వ్యాఖ్యలు..

ముసలి నక్కకు హిందు శ్మశాన వాటికతో అవసరం లేదని, కుంటి నక్కకు నియోజకవర్గంలోని వారి స్వగ్రామం ఉందని, గుడ్డినక్క ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వెళ్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి పట్టణ ప్రజలకు మాత్రం హిందూ శ్మశాన వాటికల అవసరం ఉందన్నారు. శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన నిధులతో పని చేసి మిగతా పనులను ఎస్ఆర్ ఫౌండేషన్ వారికి అప్పగిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. శ్మశాన వాటిక టెండర్ అయ్యేదెన్నడు.. వారికి అప్పగించేది ఎన్నడని ప్రశ్నించారు. ఎస్ఆర్ ఫౌండేషన్ వ్యక్తి కామారెడ్డికి వస్తే ఎమ్మెల్యే, ఎంపీకి ఎక్కడ పోటీ చేస్తాడోనన్న భయంతోనే ఇక్కడికి రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: Tractor Accident | మొక్కులు తీర్చుకుని వస్తుండగా విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ఇంటర్​ విద్యార్థిని దుర్మరణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kamareddy Train Accident | రైలు ఢీకొని గొర్లు మృతి..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Train Accident | రైలు ఢీకొని గొర్లు...

Samantha Fan Proposal | మా ఇంటి బంగారం ఈవెంట్‌లో సమంతకు ఫ్యాన్ ప్రపోజల్.. స్టేజ్‌పై జరిగిన ఘటన వైరల్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Samantha Fan Proposal | స్టార్ హీరోయిన్ సమంత...

Working Women Safety | వర్కింగ్ ఉమెన్ భద్రత ప్రభుత్వ బాధ్యత : మంత్రి సీతక్క

అక్షరటుడే, వెబ్​డెస్క్: Working Women Safety | హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్...

Odisha Septic Tank Tragedy | ఒడిశాలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఆరుగురు కూలీల మృతి

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Odisha Septic Tank Tragedy | ఒడిశాలోని కలహండి...