బిజినెస్​Nifty 24000 Rally | భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు.. మరోసారి 24 వేల మార్క్‌ను...

Nifty 24000 Rally | భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు.. మరోసారి 24 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో వారాన్ని ప్రారంభించింది. సోమవారం సెన్సెక్స్ 1,073 పాయింట్లు, నిఫ్టీ 312 పాయింట్లు పెరిగాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nifty 24000 Rally | అమెరికా -ఇరాన్ ఒప్పందం కుదిరి, కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని తెరిచే అవకాశాలుండడంతో క్రూడ్ ఆయిల్ ధరలు దిగివచ్చాయి. దీంతో ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో రూపాయి విలువ బలపడడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంచింది. అయితే ఒప్పందం తాలూకు నిబంధనలు, షరతులపై స్పష్టత లేనప్పటికీ మార్కెట్లు ర్యాలీ తీశాయి. ఈ క్రమంలో నిఫ్టీ మరోసారి 24 వేల పాయింట్ల మార్క్ ను దాటింది.

Nifty 24000 Rally | గ్యాప్ అప్‌లో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం భారీ గ్యాప్ అప్ లో ప్రారంభమై రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఉదయం సెన్సెక్స్ 720 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో 38 పాయింట్లు తగ్గినా తిరిగి పుంజుకుని మరో 462 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 221 పాయింట్ల లాభంతో ప్రారంభమె తొలుత 18 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి మరో 132 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 1,073 పాయింట్ల లాభంతో 76,488 వద్ద, నిఫ్టీ 312 పాయింట్ల లాభంతో 24,031 వద్ద స్థిరపడ్డాయి.

Nifty 24000 Rally | ఎఫ్ఎంసీజీ మినహా..

ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లు రాణించాయి. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ 2.29 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.06 శాతం, టెలికాం 1.89 శాతం, ఆటో 1.71 శాతం, యుటిలిటీ ఇండెక్స్ 1.54 శాతం, రియాలిటీ 1.50 శాతం లాభపడ్డాయి.

Nifty 24000 Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,785 కంపెనీలు లాభపడగా 1,535 స్టాక్స్ నష్టపోయాయి. 211 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 154 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 51 కంపెనీలు 56 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 6 లక్షల కోట్ల మేర పెరిగింది.

Nifty 24000 Rally

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 26 స్టాక్ లాభపడగా.. 4 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్ 2.80 శాతం, ఎల్టీ 2.71 శాతం, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ 2.67 శాతం, ఎటర్నల్ 2.40 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.37 శాతం లాభపడ్డాయి.

Losers : ఇన్ఫోసిస్ 0.49 శాతం, టీసీఎస్ 0.41 శాతం, హెచ్యూఎల్ 0.21 శాతం, సన్‌ఫార్మా 0.21 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Gains | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Mudiraj BC-A Demand | ముదిరాజ్‌లను బీసీ-ఏ జాబితాలోకి చేర్చాలి: ఈటల రాజేందర్

అక్షరటుడే వెబ్‌డెస్క్:Mudiraj BC-A Demand | తెలంగాణలో జనాభా పరంగా అత్యంత...

Kamareddy Train Accident | రైలు ఢీకొని గొర్లు మృతి..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Train Accident | రైలు ఢీకొని గొర్లు...

Samantha Fan Proposal | మా ఇంటి బంగారం ఈవెంట్‌లో సమంతకు ఫ్యాన్ ప్రపోజల్.. స్టేజ్‌పై జరిగిన ఘటన వైరల్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Samantha Fan Proposal | స్టార్ హీరోయిన్ సమంత...