అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sri Lanka Free Visa | శ్రీలంక వెళ్లాలనుకునే భారతీయ పర్యాటకులకు అక్కడి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఇకపై ఎలాంటి వీసా ఫీజులు లేకుండానే హ్యాపీగా లంక దీవిలో అడుగుపెట్టేయవచ్చు.
భారత్‌తో పాటు మరో 40 దేశాల పౌరులకు ఉచిత ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) విధానాన్ని శ్రీలంక ప్రభుత్వం నేటి నుంచే అమల్లోకి తీసుకువచ్చింది.
Sri Lanka Free Visa | ఆన్‌లైన్‌లో ఉచితంగా
ఈ కొత్త నిబంధన ప్రకారం.. శ్రీలంకకు వెళ్లాలనుకునే భారతీయులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో ఉచితంగా ‘ETA’ (Electronic Travel Authorization) కోసం దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఈ అనుమతితో పర్యాటకులు 30 రోజుల పాటు శ్రీలంకలో స్వేచ్ఛగా పర్యటించవచ్చు.
Sri Lanka Free Visa | ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశాలు:
ఆర్థిక సంక్షోభం తర్వాత కోలుకుంటున్న శ్రీలంక, తమ దేశ పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కోసం పర్యాటకులు గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు ఈ ఆన్‌లైన్ విధానం ఎంతగానో దోహదపడుతుంది.
శ్రీలంక అందాలను, చారిత్రక రామాయణ ప్రాంతాలను సందర్శించాలనుకునే భారతీయ ప్రయాణికులకు ఇది నిజంగానే బంపర్ ఆఫర్. ఆలస్యం చేయకుండా ఇప్పుడే ట్రావెల్ ప్లాన్స్ సిద్ధం చేసుకోండి!


